టీడీపీకి జేసీ రాజీనామా..!

230
jc
- Advertisement -

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన మాజీ మంత్రి,టీడీపీ నేత,అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి త్వరలోనే టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారు. ఇవే నా చివరి ఎన్నికలు అంటూ కొంతకాలంగా ప్రకటిస్తూ వస్తున్న జేసీ తన కుమారుడు పవన్‌ కోసం రాజకీయా నుండి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీడీపీలో చేరిన జేసీ 2014 ఎన్నికల్లో అనంతపురం నుండి ఎంపీగా భారీ మెజార్టీతో గెలిచారు. అప్పటినుండి చంద్రబాబుపై ప్రశంసలు గుప్పిస్తూనే మరోవైపు జగన్‌ని తూర్పారపడుతునే ఉన్నారు. అయితే జేసీ కుమారుడు పవన్‌ మాత్రం వైసీపీ నుండి టికెట్ ఆశీస్తుండం విశేషం. కుమారుడి భవిష్యత్ కోసమే జేసీ టీడీపీకి రాజీనామా చేసి రాజకీయాల నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారట.

వైసీపీ నుండి అనంతపురం ఎంపీగా జేసీ పవన్‌ పోటీచేయడం లాంఛనం కానుండటంతో టీడీపీకి గుడ్‌బై చెప్పేందుకే జేసీ నిర్ణయం తీసుకున్నారని టాక్‌. జేసీ టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారనే వార్త ఇప్పుడు ఏపీ ముఖ్యంగా అనంతపురం రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

అనంతరాజకీయాల్లో జేసీకి ప్రత్యర్థిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మాత్రం జేసీ నిర్ణయాన్ని స్వాగతించారు. జేసీ రాజకీయాల నుండి తప్పుకోవడమే మంచిదని ఆయన కుమారుడిని సైతం రాజకీయాలకు దూరంగా ఉంచాలని చురకలంటించారు. అనంతపురం జిల్లా అభివృద్ధి విషయంలో ప్రభాకర్‌ చౌదరికి జేసీకి పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. చివరికి సీఎం చంద్రబాబు జోక్యం చేసుకునే వరకు వెళ్లాయి. ఈ నేపథ్యంలో జేసీ టీడీపీకి గుడ్‌ బై చెప్పనున్నారనే వార్త ప్రాధాన్యత సంతరించుకుంది.

తండ్రి రాజకీయ వారసత్వంతో రాజకీయాల్లో ప్రవేశించిన జేసీ దివాకర్‌ రెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. తాడిపత్రి రాజకీయాల్లో ఆయనకు తిరుగులేదు. ప్రస్తుతం అనంతపురం ఎంపీగా జేసీ ఉండగా ఆయన తమ్ముడు ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఏ పార్టీలో ఉన్నప్పటికీ ఆయన స్టైల్ డిఫరెంట్.తన అభిప్రాయలు నిర్మొహమాటంగా చెప్పేస్తారు.

- Advertisement -