రేటింగ్‌లోనే కాదు..సంపాదనలోనూ టాపే..!

288
jabardasth
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో ఇంటిల్లీపాదినీ నవ్వించే కార్యక్రమాల్లో జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గురు, శుక్రవారాల్లో ప్రసారమయ్యే ఈ షోలో టీమ్‌లు చేసే స్కిట్లకు పడిపడి నవ్వాల్సిందే. ఓ వైపు కామెడీ మరోవైపు అప్పుడప్పుడు కాంట్రవర్సీలతో ఇటీవలె 300 ఎపిసోడ్‌లు పూర్తిచేసుకున్న ఈ షో బుల్లితెర ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఒక్క షో ద్వారా వందల సంఖ్యలో నటులు ఇండస్ట్రీకి వచ్చారంటే అతిశయోక్తికాదు.

ఈ కార్యక్రమం ఎంతోమంది జీవితాన్ని నిలబెట్టడమే కాదు ప్రేక్షకులకు మంచి ఎంజాయ్‌మెంట్‌ని ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న నటుల రెమ్యునరేషన్ గురించి మరోసారి చర్చజరుగుతోంది. ఎందుకంటే సినిమాల్లో నటించే కామెడీయన్‌లకు ధీటుగా ఇందులో ఉన్న న‌టులు ఓ రేంజ్ లో సంపాదిస్తున్నారు.

జడ్జిల దగ్గరి నుండి యాంకర్‌,పార్టిసిపెంట్స్‌ రెమ్యునరేషన్ చూస్తే షాకవ్వాల్సిందే.అత్యధికంగా మెగా బ్రదర్ నాగబాబు నెలకు రూ. 20 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటుండగా రోజా ఎపిసోడ్‌కు 2 లక్షల చొప్పున నెలకు 16 లక్షలు సంపాదిస్తోంది.

ఇక టీమ్ లీడర్ల విషయానికొస్తే చమ్మక్ చంద్ర అందరికంటే ఎక్కువగా రూ. 4 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటుండగా తర్వాతి స్థానంలో సుడిగాలి సుధీర్,హైపర్ ఆది రూ. 3 లక్షలు,గెట‌ప్ శ్రీను, ఆటో రాంప్ర‌సాద్ 2.5 నుంచి 3 ల‌క్షల వ‌ర‌కు పారితోషికం అందుకుంటున్నారు.

రాకెట్ రాఘ‌వ 2.5 ల‌క్ష‌లు,కిరాక్ ఆర్పీ 2.4 ల‌క్ష‌లు,భాస్క‌ర్ అండ్ టీం 2 ల‌క్ష‌లు,చ‌లాకీ చంటి 2 ల‌క్ష‌ల వ‌ర‌కు సంపాదిస్తున్నారు. సాఫ్ట్ వేర్ రంగం నుండి వ‌చ్చిన అదిరే అభి 2.5 నుంచి 3 ల‌క్ష‌ల వ‌ర‌కు సంపాదిస్తున్నారు.

ఇక యాంకర్ రష్మీకి జబర్దస్త్ షో ఎలాంటి పాపులారిటీని తెచ్చిపెట్టిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యాంక‌ర్ కంటే ముందు చిన్న చిన్న పాత్ర‌ల‌తో కెరీర్ మొద‌లుపెట్టిన అనసూయ జాతాకాన్ని మార్చేసింది జబర్దస్త్. వీరిద్దరు ఎపిసోడ్‌కు రూ. 50 వేలు అందుకుంటున్నారు.విజయవంతంగా 300 ఎపిసోడ్‌లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ షోలో కంటెస్టెంట్ల రెమ్యునరేషన్ చూసి పలువురు షాకవుతున్నారు.

- Advertisement -