జయ బయోపిక్ కాదు..కల్పితం మాత్రమే

206
dasari
- Advertisement -

భారతీయ చిత్రసీమలో దర్శకుడి తనదైన ముద్ర వేసుకున్న డైరెక్టర్ దాసరి నారాయణ రావు..ఎర్రబస్సు తర్వాత మరో సినిమాకు దర్శకత్వం అందించలేదు. కానీ తాజాగా దాసరి ఓ కొత్త సినిమా చేయడానికి సిద్ధమైయ్యారు. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి..అలనాటి నటి జయలలిత కథ ఆధారంగా ఓ సినిమా చేస్తానని తెలియజేశారు. అయితే ఇది ఆమె జీవితకథపై కాకుండా..ఇది ఒక కల్పిత కథలా తెరకెక్కించనున్నారట.

dasari

జయలలిత కథ అయితే.. ఆమె చుట్టూ ఉన్న పాత్రలు కూడా ఉండాలి. కానీ దీనిలో అవి ఉండవు. ఈ సినిమాలో హీరోయిన్‌.. మచ్చ లేని మహానాయకురాలు. ప్రజల ఆదరణ పొంది.. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని.. చివరకు దహన సంస్కారాలు చేయటానికి కూడా ఎవరూ లేక ఒంటరిగా వెళ్లిపోయిన ఒక మహానాయకురాలి కథ. ప్రపంచాన్ని జయించాలని అనుక్షణం కష్టపడి, రాజ్యవిస్తరణకు తన జీవితాన్ని ఫణంగా పెట్టిన అలెగ్జాండర్‌ ఏం పట్టుకెళ్లాడు? అనేక మంది మహానాయకులు ఒంటరి మరణాన్నే పొందుతున్నారు. అలాంటి ఒక నాయకురాలి గాథ ఇది అన్నారు. ఇందులో రమ్య క్రిష్ణ జయపాత్ర పోషించనున్నారు. ఇప్పటికే అమ్మ పేరిట ఫస్ట్ లుక్స్ కూడా బయటికి వచ్చాయి.

తన జీవిత కథపై తానే సినిమా చేస్తానని దర్శకరత్న దాసరినారాయణ రావు అన్నారు. కానీ అది ఎప్పుడో కచ్చితమైన వివరణ ఇవ్వలేదు. నా బయోపిక్‌ను తీస్తామని ఎవరో వచ్చారు. కానీ తీయటం చాలా కష్టమని చెప్పా. ఒకవేళ తీసినా ఒక భాగం చాలదు. రెండు భాగాలుండాలి. నా జీవితం తొమ్మిదో ఏట నుంచి ప్రారంభమైంది. ప్రతి ఏడాది ఏదో ఒక మెరుపో, మెలికో, మలుపో ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా నా బయోపిక్‌ ను నేనే తీస్తాని చెప్పారు.

- Advertisement -