దాసరికి పద్మశ్రీ ఇవ్వాలి: చిరు

45
dasari

దర్శకరత్న దాసరికి పద్మ శ్రీకి ఇవ్వాలని డిమాండ్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. వలం ప్రతిభావంతుడైన దర్శకుడిగానే కాకుండా పరిశ్రమలో ఎన్నో సమస్యలను పరిష్కరించిన దాసరి సేవలను గుర్తించి, ఆయన మరణానంతరమైన కేంద్రం అత్యుత్తమమైన పద్మ పురస్కారాన్ని ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. దాసరి తాను జన్మించిన మే మాసంలోనే 30వ తేదీ కన్నుమూశారు.

ఇక ఇవాళ దాసరి పుట్టినరోజు సందర్భంగా నివాళి అర్పించిన చిరు ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. కేవలం నట, దర్శకనిర్మాతగానే కాకుండా చిత్రసీమలో అన్నీ తానై వ్యవహరించిన వ్యక్తి దాసరి నారాయణరావు. వివిధ భాషల్లో 150కి పైగా చిత్రాలను రూపొందించారు.