అమ్మ జయలలిత వర్దంతి…

237
jayalalitha
- Advertisement -

ఒంటిచేత్తో రాష్ట్ర రాజకీయాలను చక్రంతిప్పిన మహిళ…ఎంజీఆర్ తర్వాత తమిళ రాజకీయాల్లో, అన్నాడీఎంకేలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ధీర వనిత. ఆమె సింగిల్ హ్యాండ్ తో పాలిటిక్స్ ని నడిపించగల సత్తా ఉన్న ఉక్కు మహిళ..కంటిచూపుతో పార్టీని శాసించగల నేర్పు..అవరోధాలను,ప్రతికూలతలను ఎదుర్కొనే సత్తా…ఒక్కమాటలో చెప్పాలంటే జయ అంటే తమిళనాట ఓ వ్యక్తి కాదు.. ఓ శక్తి.. ఒకానోక దశలో దేశ రాజకీయాల్లో సైతం తనదైన ముద్రను వేసుకుంది జయలలిత. జయలలిత వర్దంతి సందర్బంగా అమ్మ చేసిన సేవలను గుర్తు చేస్తూ నివాళులు అర్పిస్తున్నారు పార్టీ నేతలు,అభిమానులు.

తమిళ రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన జయలలిత….జీవితం పూల పాన్పుకాదు. ఎన్నో ఒడిదొడుకులు…ఇంకెన్నో సమస్యలు అన్నింటిని ఎదురించి…ఉక్కుమహిళగా…అమ్మగా తనదైన ముద్రవేసింది. ఫిబ్రవరి 24, 1948న అప్పటి మైసూరురాష్ట్రంలోని పాండవపుర తాలూకా,మేలుకోటేలో జయరాం, వేదవల్లి దంపతులకు జన్మించింది. తల్లి ఒక తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ వంశానికి చెందినది.జయలలిత అసలు పేరు కోమలవల్లి.అది ఆమె అవ్వగారి పేరు. బ్రాహ్మణ సంప్రదాయాన్ని అనుసరించి ఆమెకు రెండు పేర్లు పెట్టారు.జయలలిత అనే రెండో పేరును పాఠశాలలో చేర్చేటపుడు నమోదు చేశారు.

1982లో పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చారు జయ. ప్రభుత్వ వ్యవహారాల్లో తలమునకలై ఉన్న సమయంలో పార్టీ క్యాడర్‌కు అందుబాటులో ఉండేందుకు ఎంజీఆర్‌ తన తరఫున జయలలితను ప్రచార కార్యదర్శిగా నియమించారు. అయితే, ఆర్‌ఎం వీరప్పన్‌, ఎస్‌డీ సోమసుందరం లాంటి పార్టీలోని ఉద్దండులైన నాయకుల నుంచి నిరసనలు వ్యక్తం కావడంతో జయలలితను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. అయితే, అనంతరం వీరి మద్దతుతోనే జయలలిత తొలిసారిగా 1991లో తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు.

ఇందిరాగాంధీ హత్యతో నూ, ఎంజీఆర్‌ అనారోగ్యంతో ఉన్న కారణంగాను ఉత్పన్నమైన సానుభూతి నేపథ్యంలో జయలలిత తమ పార్టీ సీనియర్‌ నాయకులెవరిని సంప్రతించకుండానే కాంగ్రెస్‌ పార్టీ జతకట్టి 1984లో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళారు. ఏఐఏడీఎంకే స్టార్‌ క్యాంపెయినర్‌గా జయలలిత వెలుగొందుతున్నప్పుడు, వైద్య చికిత్స కోసం ఎంజీఆర్‌ 1987లో అమెరికా వెళ్ళారు. 1987లో ఎంజీ రామచంద్రన్‌ మరణించడంతో ఆయన సతీమణి జానకి కొద్ది కాలం పాటు తమిళనాడు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారు. ఎంజీఆర్‌కు నిజమైన రాజకీయ వారసురాలిగా జయలలిత ప్రకటించుకొని పార్టీని చీల్చారు.

సెప్టెంబరు 27, 2014 న జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు అయింది. దాంతో ఆమె తన ముఖ్యమంత్రి పదవి రద్దైనది. పదవిలో ఉండగా కేసులో ఇరుక్కుని పదవీచ్యుతురాలైన మొదటి ముఖ్యమంత్రి అయింది.మే 11, 2015న కర్ణాటక ఉన్నత న్యాయస్థానము ఆమెను నిర్దోషిగా విడిచిపెట్టింది. దాంతో ఆమె మే 23న తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టింది. తమిళ రాజకీయ, సినీ రంగం లో తన దైన శైలిని సృష్టించిన ఘనత ఒక్క జయలలితకు మాత్రమే సాధ్యమైంది ..

  • 1988 లో రాజ్యసభకు ఎన్నిక
  • 1989 గెలుపు,
  • 1991 గెలుపు.
  • 1996 లో జయలలితపై వచ్చిన కొన్ని అభియోగాలు కారణంగా ఓడిపోయిన ఆమె పార్టీ (1996 ఓటమి),
  • (2001 గెలుపు)
  • 2001 లో అత్యధిక మెజారిటీతో గెలిచింది.
  • 2006 లో ఓటమి.
  • 2011 లో తిరుగులేని మెజారిటీతో ఎన్నిక
  • 2016 లో కూడా విజయం సాధించి ఆరోసారి ముఖ్యమంత్రిగా ఎన్నిక
- Advertisement -