- Advertisement -
కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం మృతిచెందగా ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు పలువురు విచారం వ్యక్తం చేశారు. సైనికుడిగా, రాజకీయ నేతగా దేశానికి ఆయన అమోఘమైన సేవలు అందించారని కొనియాడారు.
1938 జనవరి 3వ తేదీన జన్మించిన ఆయన.. ఇండియన్ ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు. బీజేపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఆయన ఒకరు. పార్లమెంటు సభ్యుడిగా అత్యధిక కాలం పనిచేసిన నేతగా గుర్తింపు పొందారు. రాజ్యసభ, లోకసభలో ఆయన 1980 నుంచి 2014 వరకు కొనసాగారు. వాజ్ పేయ్ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేశారు.
- Advertisement -