కొండా లక్ష్మణ్ బాపూజీకి సీఎం కేసీఆర్ నివాళి..

177
cm kcr

స్వాతంత్య్ర సమరయోధుడు, తొలిదశ తెలంగాణ ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి కొండా లక్ష్మణ్‌ బాపూజీ 105వ జయంతి సందర్భంగా నివాళి అర్పించారు సీఎం కేసీఆర్. ఆదివారం ఆయన ప్రగతి భవన్‌లో లక్ష్మణ్‌ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం…కొండా లక్ష్మణ్‌ బాపూజీ నేటితరానికే కాకుండా భావితరాలకు స్ఫూర్తి అని కొనియాడారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో, నాన్‌ ముల్కీ ఆందోళనలో బాపూజీ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచిన మహనీయుడు లక్ష్మణ్‌ బాపూజీ అని కొనియాడారు.