విద్యుత్ సంస్కరణల చట్టాన్ని వ్యతిరేకిస్తాం: ఎంపీ

723
Venkatesh Netha
- Advertisement -

ఇటీవల కాలంలో కేంద్ర మంత్రులు, రాష్ట్ర బీజేపీ నేతలు అబద్ధాలు, అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు అని పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత అన్నారు. ఆయన ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎంపీలతో పాటు కేంద్ర మంత్రులు కూడా అబద్ధాలు చెప్పడం విడ్డూరం ఉంది. తెలంగాణకు రావాల్సిన 13 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాలో 6..25 లక్షల టన్నులు రాష్ట్రానికి కేటాయించమని బీజేపీ నేతలు చెప్పడం తప్పు.ఇప్పటి వరకు 1.17 మిలియన్ టన్నుల యూరియా రాష్ట్రానికి అందించలేదని తెలిపారు.

రామగుండం ఫ్యాక్టరీలో 800 అదనపు ఉద్యోగాల్లో తెలంగాణ వారికి ఎంత మందికి ఇచ్చారో చెప్పాలి. రామగుండంలో రాష్ట్ర వాటా 11 శాతం వుంది. ఇతర రాష్ట్రాల వారికి ఉద్యోగాలు ఇచ్చారు. మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు అభ్యంతరకరం అన్నారు. ఇటీవల రామగుండం ఎరువుల కర్మాగారంలో ఇద్దరు కేంద్ర మంత్రులు సమీక్ష కు వచ్చారు..కానీ ప్రొటోకాల్ పాటించలేదు.. స్థానిక ఎంపీగా నాకు ఆహ్వానం అందలేదన్నారు. స్థానిక ఎంపీ అయిన నాకు సమాచారం ఎందుకు ఇవ్వలేదో కేషన్ రెడ్డి చెప్పాలి.ప్రోటోకాల్ ప్రకారం నాకు దక్కాల్సిన ఆహ్వానం అందలేదు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని బీజేపీ కార్యాలయంలా మార్చారు. రామగుండం ఫ్యాక్టరీతో కాలుష్యం ఎదుర్కొనే రెండు గ్రామాల ప్రజాలు కేంద్ర మంత్రులకు నిరసన తెలిపారు. ఇర్లపల్లి,లక్ష్మిపుర్ ప్రజలకు పునరావాసం కల్పించాల్సిందే.ప్రజల తరపున మేము హాజరయ్యాం.బీజేపీ నేతలు ఆత్యుత్సాహంతో మా మీద దాడులు చేసేందుకు ప్రయత్నం చేశారని ఎంపీ తెలిపారు.

కేంద్రం అంతరాష్ట్ర నదీ జలాల సమస్య పరిష్కారం ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి..కానీ ఎందుకు చేయలేదో చేప్పాలి.పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రాన్ని ఇదే అంశంపై నిలదిస్తాం. జాతీయ రహాదారుల విషయంలో కేంద్రం అన్యాయం చేసింది. విద్యుత్ సంస్కరణల చట్టాన్ని వ్యతిరేకిస్తాం..దీని వల్ల వ్యవసాయ విద్యుత్ కు మీటర్లు బిగించాల్సి వస్తుంది.రాష్ట్రం బీజేపీ నేతలు విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో మాతో కలిసి వస్తారా?రారా ?.రాష్ట్ర పునర్విభజన హామీలను నేర వేర్చచాల్సిన బాధ్యత కేంద్రానిది.బీజేపీ నేతలకు చిత్త శుద్దినవుంటే మాతో కలిసి రావాలి.లేదంటే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని ఎంపీ వెంకటేష్‌ నేత తెలిపారు.

ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కెసిఆర్ చేస్తున్న కార్యక్రమాలు బిజేపీ నేతలకు నచ్చడం లేదు. అందుకే వారు తెలంగాణలో భవిష్యత్తు లేదని ఇస్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణలో తమకు స్థానం లేదనే బీజేపీ నేతల ఆందోళన అన్నారు. టి.భాను ప్రసాద్, ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. కొత్త రెవిన్యూ చట్టంతో ప్రజలకు ఎంతో మేలు అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాగే వ్యవహరిస్తే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు దెబ్బతింటాయి. కేంద్రం ఇప్పటికైనా వైఖరి మార్చుకోవాలి అన్నారు.

- Advertisement -