మహేష్ ‘బాలచంద్రుడు’కి 30 ఏళ్లు..

201
mahesh

టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు నటించిన సూపర్ హిట్ చిత్రం ‘బాలచంద్రుడు’ నేటితో 30 యేళ్లు పూర్తి చేసుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు బాలనటుడిగా నటించిన చిత్రాల్లో ‘బాలచంద్రుడు’ సినిమా ఒకటి. ఈ సినిమా 1990లో విడుదలైన సూపర్‌ హిట్ అయింది. బాల నటుడిగా మహేష్ బాబు చివరి చిత్రం ఇదే.‘బాలచంద్రుడు’ సినిమా తర్వాత మహేష్ బాబు దాదాపు తొమ్మిదేళ్లు గ్యాప్ తీసుకుని.. ‘రాజకుమారుడు’ సినిమాతో పూర్తిస్థాయి హీరోగా ఎంట్రీ ఇచ్చారు.

‘బాలచంద్రుడు’ చిత్రంలో మహేష్ బాబు చేసిన డాన్సులు అప్పట్లో పెద్ద సెన్సేషన్ అయ్యాయి.మహేష్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ కృష్ణ డైరెక్ట్ చేసారు. ఈ చిత్రంలో శరత్ కుమార్, రామిరెడ్డి, విజయచందర్ నటించారు.‘బాలచంద్రుడు’ చిత్రం అప్పట్లో పెద్ద విజయాన్నే నమోదు చేసింది. ఈ చిత్రాన్ని పద్మాలయా క్రియేటివ్స్ బ్యానర్‌లో పద్మావతి, మంజుల ప్రొడ్యూస్ చేసారు.

‘బాలచంద్రుడు’ చిత్రంలో మహేష్ బాబు చేసిన ఫైట్స్ కూడా మంచి పేరు తీసుకొచ్చాయి.అప్పటి వరకు బాలనటుడిగా తన తండ్రి కృష్ణతో పాటు రమేష్ బాబుతోనే నటిస్తూ వస్తోన్న మహేష్ బాబు.. ఈ చిత్రంలో సింగిల్ హీరోగా నటించడం విశేషం.‘బాలచంద్రుడు’ చిత్రానికి రాజ్ కోటి అద్భుతమైన సంగీతం అందించారు.