ఎన్టీఆర్ తో బాలీవుడ్ భామ ఫిక్స్!

23
- Advertisement -

దివంగత లెజెండరీ నటి శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్ స్టార్ జాన్వీ కపూర్ తెలుగులో అరంగేట్రం చేయడానికి సిద్ధమవుతోంది. త్వరలోనే Jr NTRతో కలిసి పనిచేయబోతుంది. ఈ సినిమా ద్వారా జాన్వీ తన కలలు నెరవేరర్చుకోబోతుంది. ధడక్ , గుంజన సక్సేనా తో నటిగా గుర్తింపు అందుకున్న జాన్వీ ఏ పరిశ్రమలోనైనా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని చాలాసార్లు పేర్కొంది.

తారక్‌తో జోడీ కట్టేందుకు జాన్వీ చాలా కాలంగా ఎదురుచూస్తుంది. కొన్ని నెలలుగా ఎన్టీఆర్-జాన్వీ జంటతో సినిమా చేయాలని చూస్తున్న కొరటాల శివ తాజాగా ఆమెకు స్టోరీ చెప్పి బోనీ కపూర్ నుండి గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడు. జాన్వీ త్వరలోనే #NTR30 షూటింగ్ లో పాల్గొననుంది టీమ్ త్వరలోనే ఆమెకు వెల్కమ్ ఆన్‌బోర్డ్‌ చెప్పనున్నట్లు తెలుస్తుంది.

జూనియర్ ఎన్టీఆర్ తాజాగా RRR తో బాలీవుడ్ లో మంచి గుర్తింపు అందుకున్నాడు. ఇది బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. ఈ సినిమాతో బాలీవుడ్ కి బాగా దగ్గరయ్యాడు ఎన్టీఆర్. ఫిబ్రవరి చివరి నుండి లేదా మార్చ్ నుండి NTR30 చేసే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

ఇవి కూడా చదవండి..

 

- Advertisement -