అవసరం లేని వివాదం గురించి జగపతిబాబు

20
- Advertisement -

ఇది సోషల్ మీడియా కాలం. ఎక్కడ ఏ చిన్న మాట తూలినా ఏ ఇష్యూ మీద ఏమరుపాటుగా స్పందించినా దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో ముందే ఊహించలేం. అందులోనూ సీనియర్ ఆర్టిస్టులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. ఒకప్పుడంటే మీడియా ఎక్కువగా ప్రింట్ కే పరిమితమయ్యేది కాబట్టి ఏదైనా వివాదం రేగినా దాన్ని పెద్దిది చేయడానికి అవకాశవాదులకు వీడియో ప్రూఫులు ఉండేవి కాదు. కానీ ఇప్పుడలా కాదు. సందర్భం ఏదైనా సరే ప్రతిఒక్కటి సెల్ ఫోన్ ద్వారానో లేదా డిజిటల్ క్యాం ద్వారానో సదరు ఆధారాలు బయటికి వెళ్ళిపోతున్నాయి

ఇటీవలే జగపతిబాబు ఓ యూట్యూబ్ ఛానల్ ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు. కులాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు. పదిహేనేళ్ల క్రితం సిద్దార్థ కాలేజీలో ప్రసంగం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఈయన కులరహిత సమాజం గురించి మాట్లాడతానని ప్రిన్సిపాల్ తో ముందే అన్నారు. అయితే ఆడిటోరియం లో ఉండే వందలాది విద్యార్థులు అందరూ ఒకే వర్గానికి చెందినవాళ్లని ఒకవేళ ఈ టాపిక్ తీసుకొస్తే అక్కడే మిమ్మల్ని తుక్కు రేపేస్తారని హెచ్చరించారట. అంత పెద్ద హీరోనైనా తననే కేర్ చేయరనే మనస్తత్వం వాళ్ళదట .

ఇప్పుడీ వీడియోనే ట్విట్టర్ లో హల్చల్ చేస్తోంది. ప్రత్యేకంగా సదరు సామాజిక వర్గం పేరుని చెప్పి మరీ జగ్గు భాయ్ ఇలా ఓపెన్ గా చెప్పేయడం వల్ల ఆయనకు పెద్దగా నష్టం ఉండకపోవచ్చు కానీ ఇంకో కులం వాళ్ళో రాజకీయ ప్రయోజనాలు చూసుకునేవాళ్ళో దీన్ని తప్పుగా జనంలోకి తీసుకెళ్లే ప్రమాదం ఉంది. అయినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా చాలా బిజీ లైఫ్ గడుపుతున్న జగపతిబాబు ముందు నుంచి వివాదాలకు దూరంగానే ఉన్నారు. కూతురికి దేశాంతర వివాహం జరిపి ఆదర్శంగా నిలిచారు. అవే భావాలు సమాజంలో ఉండవుగా. అందుకే ఇబ్బందులొచ్చే చిక్కు లేకపోలేదు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -