అమ్మతనాన్ని చూపించిన హీరోయిన్ !

22
- Advertisement -

హీరోయిన్ ప్రణీత సుభాష్ తల్లి అయిన సంగతి తెలిసిందే. ఓ పండంటి పాపకు ఆమె జన్మనిచ్చింది. ఐతే, తన గారాల తనయ పాదాలు నేలకు తాకకుండా హీరోయిన్ ప్రణీత సుభాష్ కమ్మని అమ్మతనాన్ని చూపించింది. ఈ సమస్త సృష్టిలో దేవ‌త‌ల‌కు కూడా ద‌క్క‌ని అపూర్వ అనుభూతి అమ్మ. ఈ లోకమంతా మాతృత్వం మీదే ఆధారపడి నడుస్తోంది. అందుకే, భూమ్మీద అన్నీ ప్రేమ‌ల‌క‌న్నా అమ్మ ప్రేమ మిన్నా అన్నారు. ప్రస్తుతం ఆ ప్రేమను తన ముద్దుల కూతురు ‘ఆర్న’ కి పంచి పెడుతుంది ప్రణీత సుభాష్.

ప్రణీత సుభాష్ తన కూతురు ఆర్న తో ఉన్న ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూస్తుంటే.. అమ్మతనానికి ఎవరైనా ఒకేలా ఉంటారని అనిపిస్తుంది. అర్ధ నగ్న అందాలతో, శృంగార భరిత దృశ్యాలలో నటించే హీరోయిన్లలో కూడా అపురూప మైన అమ్మ ఉంటుంది. సినిమా హీరోయిన్ అనగానే సహజంగా చిన్నచూపు ఉంటుంది. కానీ, వాళ్లల్లోని అమ్మను తక్కువ చేయలేం. ఎంత హీరోయిన్ అయినా.. అమ్మ అమ్మే. ఈ విషయంలో ప్రణీత సుభాష్ నిజంగా నిదర్శనంగా నిలిచింది. తన కూతుర్ని కిందకు దించకుండా ప్రణీత సుభాష్ జాగ్రత్తగా ఎత్తుకున్న విధానం చూస్తుంటే ముచ్చట వేస్తోంది.

ప్రణీత సుభాష్ అమ్మ తనానికి ప్రతిరూపంలా నిలిచారు. తన కూతురు ఆర్నపై ప్రణీత సుభాష్ ఎంతో అపురూపమైన ప్రేమను చూపించారు. తన కూతురు కాలు నేల పై పెట్టకుండా చూసుకున్నారు. కష్టమైనా ఇష్టంగా కూతుర్ని ఎత్తుకుని ప్రణీత సుభాష్ కనిపించింది. అమ్మ అంటే ఆత్మీయ‌త‌, అమ్మ అంటే అనుబంధం అని ప్రణీత సుభాష్ ఈ ఫొటోలతో నిరూపించారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -