ధర్మ పరిరక్షణ కోసం జనసేనాని యాగం..

61
- Advertisement -

ధర్మ పరిరక్షణ, ప్రజాక్షేమం, సామాజిక పరివర్తన మార్పు కోసం జనసేనాని పవన్‌ కళ్యాణ్ యాగం చేపట్టారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలోని విశాల ప్రాంగణంలో యాగశాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రం సుభీక్షంగా ఉండేందుకు ఈ యాగం చేయనున్నారు. యాగశాలలో అయిదుగురు దేవతామూర్తులు ప్రతిస్థాపించారు.

ఈ యాగశాలలో స్థిరత్వం స్థిత ప్రజ్ఞత ప్రసాదిత దేవత గణపతి శత్రు శత్రుత్వ నిరోధిత దేవత చండీ మాతను, అష్టైశ్వర్య ప్రసాదాధిపుతులైన శివపార్వతులు, ఆయురారోగ్య ప్రదాతైన సూర్య భగవానుడు, ధార్మిక సమతుల్యత…త్రిస్థితియుక్త కారకుడైన శ్రీమహావిష్ణువు ఈ యాగపీఠంపై ఆసీనులై ఉన్నారు. ఈ ఐదు దేవతా మూర్తులను అభిముఖంగా యంత్ర స్థాపన చేపట్టారు. విగ్రహం…యంత్రం…హోమం ఆలంబనగా నేటి ఉదయం ప్రారంభమైన ఈ యాగం రేపు కూడా కొనసాగుతుందన్నారు.

Also Read: డిజిటల్ డిటాక్స్ అంటే ఏంటో తెలుసా?

- Advertisement -