30న.. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ ‘7:11 PM’

85
- Advertisement -

సాహస్, దీపికా నటించిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ 7:11 PM ఫస్ట్ లుక్‌, ఫస్ట్ సింగిల్ తర్వాత టీజర్‌ తో అందరిలో క్యురియాసిటీ పెంచింది.

చైతు మాదాల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆర్కస్ ఫిల్మ్స్ పతాకంపై నరేన్ యనమదల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటి నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సినిమా విడుదల తేదీని నిర్మాతలు అనౌన్స్ చేశారు. 7:11 PM మైత్రి ద్వారా జూన్ 30న విడుదల అవుతుంది. ప్రముఖ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ హౌస్ దీనికి సపోర్ట్ ఇవ్వడంతో 7:11 PM భారీగా విడుదల కానుంది.

Also Read:డిజిటల్ డిటాక్స్ అంటే ఏంటో తెలుసా?

ఈ చిత్రానికి శివ శంకర్, ఫాబియో కాపోడివెంటో సినిమాటోగ్రఫీని అందించగా, శ్రీను తోట ఎడిటర్.తారాగణం – సాహస్, దీపిక, టెస్, రఘు కారుమంచి, డా. భరత్ రెడ్డి, రైజింగ్ రాజు & ఇతరులు

Also Read:కోమటిరెడ్డితో జూపల్లి భేటీ..

- Advertisement -