డిజిటల్ డిటాక్స్ అంటే ఏంటో తెలుసా?

46
- Advertisement -

సాంకేతికత అదే టెక్నాలజీ మన నిత్యజీవితంలో భాగస్వామ్యమై పోయింది. వినోదం నుండి విశ్రాంతి వరకు, చదువుల నుండి ఉద్యోగాల వరకు ప్రతిది డిజిటలే. ఇక ముఖ్యంగా కరోనా లాక్ డౌన్ తర్వాత డిజిటల్ స్క్రీన్ వాడకం మరింత పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో మన శరీరం, మనస్సు ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని దూరం చేసుకోవడం ఎంతో అవసరం. అయితే పూర్తిగా దూరం చేసుకోలేకపోయిన కనీసం రోజుకు ఓ గంటన్నర పాటైన వీటికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే డిజిటల్ డిటాక్స్ తెరపైకి వచ్చింది.

ఫోన్లు, కంప్యూటర్లకు అతుక్కుపోయేవాళ్లు సమస్యల బారిన పడకుండా ఉండాలంటే ‘డిజిటల్‌ డిటాక్స్‌’ పాటించడం తప్పనిసరి. అసలు డిజిటల్ డిటాక్స్ అంటే ఏంటంటే..ఫోన్లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను ఉపయోగించకపోవడమే. ఈ డిజిటల్ డిటాక్స్ వల్ల సెన్సాఫ్ సెల్ అవేర్‌నెస్ పెరుగుతుంది.సోషల్ ఇంటరాక్షన్స్ పెరుగుతాయి. ఒత్తిడి ఆందోళనకు గురికాకుండా చక్కగా నిద్రపోయే అవకాశం ఉంటుంది. మానసిక ఒత్తిడిని కూడా దూరం చేయవచ్చు.

Also Read:కోమటిరెడ్డితో జూపల్లి భేటీ..

మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో మొహిత్యాంచే వర్గావ్ అనే గ్రామం ఉంది. ఈ ఊరిలో ప్రతిరోజు రాత్రి 7 గంటలకు ఓ సైరన్ మోగుతుంది. సైరన్ మోగిన వెంటనే ప్రజలంతా ఫోన్లు పక్కన పడేసి, టీవీలు బంద్ చేస్తారు. ఒక గంటన్నర పాటు ఎలాంటి ఎలాక్ట్రానిక్ వస్తువులు ముట్టుకోరు. పిల్లలంతా చదువులపై నిమగ్నమవుతారు.ఎన్ని ముఖ్యమైన పనులున్నా సరే. కాల్స్ అటెండ్ చేయరు.పెద్దలంతా మంచిచెడుల గురించి చర్చించుకుంటారు. లాక్ డౌన్ సమయంలో పిల్లలు ఫోన్లకు ఎక్కువగా అలవాటుపడిపోయి సోమరులుగా మారారు. దీంతో గ్రామంలో డిజిటల్ డిటాక్స్ పద్దతిని అమల్లోకి తెచ్చారు. తర్వాత క్రమక్రమంగా గ్రామ ప్రజల్లో స్పష్టంగా మార్పు కనిపించింది. ఇప్పుడే ఇదే విధానం ప్రపంచమంతా ఆకర్షిస్తోండగా మీరు కూడా మీ ఇంట్లో ఈ డిటాక్స్ విధానం అమలు చేసి చూడండి..మార్పు మీకే తెలుస్తుంది.

- Advertisement -