ఖాళీ కడుపుతో టీ తాగితే ప్రమాదమా!

16
- Advertisement -

ఉదయం నిద్ర లేచినది మొదలుకొని రాత్రి పడుకునే వరకు రోజు కనీసం ఐదు లేదా ఆరు సార్లు టీ లేదా కాఫీ తాగే అలవాట చాలమందికి ఉంటుంది. కేవలం మనదేశం లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా టీ లేదా కాఫీకి బానిసలైనా వారు ఎక్కువగానే ఉన్నారు. ముఖ్యంగా ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగకపోతే చాలమందికి రోజు గడవదు. అయితే ఇలా ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగితే నష్టాలు తప్పవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. టీ లేదా కాఫీలో కెఫీన్ అధికంగా ఉంటుంది. అందువల్ల ఖాళీ కడుపుతో తాగినప్పుడు జీర్ణాశయంలో ఆమ్లత్వం పెరుగుతుంది. తద్వారా కడుపు నొప్పి, ఎసిడిటీ ఏర్పడే ప్రమాదం ఉంది. పైగా ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం వల్ల ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ చేసే ఆసక్తి తగ్గుతుంది.

బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం వల్ల నీరసం ఏర్పడడంతో పాటు తరచూ అలసటకు గురి కావాల్సి వస్తుంది. ఇంకా కాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగితే గుండె సంబంధిత వ్యాధులు రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇంకా టీ లోని కెఫీన్ వల్ల అధిక రక్తపోటు సంభవించే ప్రమాదం ఉంది. ఇవి మాత్రమే కాకుండా ఖాళీ కడుపుతో టీ తాగితే నాడీ వ్యవస్థ కూడా దెబ్బ తింటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల తలనొప్పి కూడా వేధిస్తుంది. ఇదే మైగ్రేన్ కు దారి తీస్తుంది. కాబట్టి వీలైనంత వరకు ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం మానేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది మాత్రమే కాకుండా రోజుకు ఒకటి లేదా రెండుసార్లకు మించి ఎక్కువగా టీ లేదా కాఫీ తాగడం కూడా ప్రమాదమే కాబట్టి సాధ్యమైనంత వరకు కెఫీన్ పదార్థాలకు దూరంగా ఉండడమే మంచిదని నిపుణులు చెబుతున్నా మాట.

గమనిక : ఈ సమాచారం ఈ అవగాహన కొరకు అందించడం జరిగింది, ఇందులో ఏమైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించడం మంచిది.

Also Read:Congress:కాంగ్రెస్ కు 17 సీట్లు..అన్యాయమా?

- Advertisement -