ప్రస్తుతం ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. మూడు ప్రధాన పార్టీలైనా వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. ఓవైపు వైసీపీ కేవలం విజయం మాత్రమే కాదు.. 175 స్థానాల్లోనూ క్లీన్ స్వీప్ చేయాలనే టార్గెట్ పెట్టుకుంటే.. మరోవైపు గత ఎన్నికల్లో ఎదురైన పరాభవాన్ని అధిగమించి ఈసారి పక్కా విజయం సాధించాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. మరోవైపు అవినీతిరహిత పాలన అందిస్తానని ఒక్కసారి జనసేనకు ఛాన్స్ ఇవ్వండి అంటూ పవన్ కూడా అధికారంపై గట్టిగానే కన్నెశారు. దీంతో ఈసారి ఎన్నికల్లో త్రిముఖ పోరు గట్టిగానే కనిపిస్తోంది. అయితే గతంతో పోలిస్తే ప్రస్తుతం ఏపీలో జనసేన పార్టీ చాలకింద నీరులా విస్తరిస్తోంది. .
నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజాసమస్యలపై అరా తీయడంలో పవన్ముందున్నారు. అలాగే రైతు భరోసా యాత్ర, జనవాణి వంటి కార్యక్రమాలతో గ్రామస్థాయిలో కూడా జనసేనపై పాజిటివ్ బజ్ ఏర్పడుతుంది. అయితే వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభావం ఎలా ఉండబోతుదనేదే ప్రధానంగా నడుస్తున్న చర్చ. కాగా వచ్చే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వస్తుందా రాదా అనే విషయాన్ని పక్కన బెడితే.. వైసీపీ, టీడీపీ పార్టీలకు గట్టిగానే ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం జగన్ ప్రభుత్వంపై అనుకూలత ఏ స్థాయిలో ఉందో వ్యతిరేకత అంతే స్థాయిలో ఉందనేది పోలిటికల్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న మాట.
ఈ నేపథ్యంలో జగన్ నిర్దేశించుకున్న 175 స్థానలు సాధించడం అనేది అంతా ఈజీ కాదు అనే సంగతి అదరికి తెలుసు. ఇక టీడీపీ పరిస్థితి కూడా గతంతో పోలిస్తే చాలా బలహీన పడిందనేది ఎవరు కదనలేని సత్యం. ఈ నేపథ్యంలో టీడీపీ గెలుపు అవకాశాలు కూడా అంతంత మాత్రమే. ఇలాంటి సమయంలో జనసేన బలం పెంచుకుంటూ ఉండడం.. అటు టీడీపీ, ఇటు వైసీపీ రెండు పార్టీలకు కూడా గట్టి దేబ్బేనని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే పవన్ పొత్తులకు కూడా సిద్దంగా ఉండడంతో.. ఒకవేళ పవన్ పొత్తుకు సిద్దమైతే టీడీపీతో కలిసే అవకాశాలే ఎక్కువ. అందువల్ల టీడీపీ జనసేన కలిస్తే వైసీపీకి భారీ ఎఫెక్ట్ కలిగే అవకాశం ఉంది. దీంతో తాజా పరిణామాలు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో పవన్ కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి…