చిత్తూరులో జల్లికట్టు..పలువురికి గాయాలు

115
jalli kattu
- Advertisement -

సంక్రాంతి పండగకు ముందే చిత్తూరు జిల్లాలో జల్లికట్టు హడావిడి మొదలైంది.. తిరుపతి రూరల్ మండలంలోని కొత్త శానంబట్ల గ్రామంలో ఉదయం నుండి జల్లికట్టు వేడుకలు‌ గ్రామస్తులు నిర్వహించారు.. ఈ‌జల్లికట్టు వేడుకలకు దాదాపు 36 గ్రామాల‌ నుండి ప్రజలు హాజరయ్యరు.. ఆంధ్ర, తమిళనాడు,‌ కర్ణాటక రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున యువత హాజరై కోడిగిత్తలకు కట్టిన బహుమతులను సొంతం చేసుకునేందుకు ఉత్సహం చూపిస్తున్నారు.

ఈ జల్లికట్టులో దాదాపు వివిధ ప్రాంతాల నుండి 100‌కు పైగా జత ఎద్దులు హాజరు కాగా, ముప్పైకి పైగా ఉడ్డలు జల్లికట్టులో కోడిగిత్తలను పంపారు.. కోవిడ్ వ్యాప్తి నేపధ్యంలో గ్రామంలో జల్లికట్టు నిర్వహించేందుకు పోలీసులు ఆకాంక్షలు పెట్టినా గ్రామస్తులు పట్టించుకోకుండా జల్లికట్టును గ్రామస్తులు నిర్వహించారు.. జల్లికట్టులో కోడిగిత్తలను పట్టుకునే ప్రయత్నంలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

- Advertisement -