నో టికెట్.. వారిలో టెన్షన్?

73
- Advertisement -

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార వైసీపీలో మార్పులు ఆ పార్టీ నేతలను కలవరానికి గురి చేస్తోంది. ఈసారి ఎన్నికల్లో వై నాట్ 175 లక్ష్యంతో ఉన్న జగన్మోహన్ రెడ్డి. పార్టీలో లోటుపాట్లను సరి చేసే పనిలో ఉన్నారు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నేతలను పక్కన పెట్టేందుకు ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఇప్పటికే 11 నియోజకవర్గాల్లోని ఇంచార్జ్ లను మార్చిన జగన్మోహన్ రెడ్డి.. సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా మార్చే ఆలోచనలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. దాదాపు 40-50 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజావ్యతిరేకత ఉందని పార్టీ అంతర్గత సర్వేలో తేలడంతో వారందనిని పక్కన పెట్టె ఆలోచనలో ఉన్నారట. ఈ నేపథ్యంలో పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న కొందరికి ఈసారి టికెట్ దక్కేనా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి..

ముఖ్యంగా మంత్రి రోజా, గుడివాడ అమర్నాథ్, విడుదల రజిని, కొడాలి నాని.. వంటి వారికి ఈసారి సీటు కష్టమే అనే వాదన వినిపిస్తోంది. ఎందుకంటే వీరిపై సోషల్ మీడియాలోనూ ప్రజల్లోనూ తీవ్ర వ్యరేకత కనబడుతోంది. ఈ నేపథ్యంలో వీరికి టికెట్ ఇస్తే ఈసారి గెలుపు కష్టమే అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయట. ఇక సీట్ల కేటాయింపుపై మంత్రి రోజా స్పందిస్తూ.. ‘ తనకు సీటు దక్కకపోయినా జగన్ వెంటే ఉంటానని చెప్పుకొచ్చారు. ఆ మధ్య గుడివాడ అమర్నాథ్ మరియు కొడాలి నాని వంటి వారు కూడా ఇదే విషయాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇక పైపైన టికెట్ విషయంలో ధీమాగా ఉన్నప్పటికి లోలోపల వీరిలో టెన్షన్ మొదలైందనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. మరి పార్టీలో కీలక నేతలుగా వ్యవహరిస్తూ వచ్చిన వీరికి జగన్ సీట్ల కేటాయింపు జరుపుతారా ? లేదా సర్వేల ఆధారంగా కీలక నేతలను కూడా పక్కన పెడతారా అనేది చూడాలి.

Also Read:స్కిప్పింగ్ తో ఎన్ని ప్రయోజనాలో..!

- Advertisement -