BJP:కిషన్ రెడ్డి చుట్టూ రాజకీయం?

39
- Advertisement -

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అలక పునారా ? బీజేపీ అధ్యక్ష పదవిలో ఉండేందుకు ఆయన విముకత చూపుస్తున్నారా ? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సింగిల్ డిజిట్ కే పరిమితం కావడంపై కిషన్ రెడ్డి నాయకత్వ లోపమే అనే వాదన వినిపిస్తోంది. ఎన్నికల ముందు ఎంతో కొంత బలంగా ఉన్న కాషాయ పార్టీ.. అధ్యక్ష మార్పు చేపట్టిన తరువాత పూర్తిగా డీలా పడింది. పార్టీలోని ఇతర నేతలను ముందుండి నడిపించడంలో కిషన్ రెడ్డి కంప్లీట్ గా విఫలం అయ్యారు. బండి సంజయ్ మరియు ఈటెల రాజేందర్ వాటి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందనే టాక్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. వారి మద్య విభేదాలకు తెరదించి ఒకే తాటిపైకి తీసుకొచ్చి ఉంటే పార్టీ ఎంతో కొంత ప్రభావం చూపే అవకాశం ఉండేది. .

కానీ కిషన్ రెడ్డి ఆ ప్రయత్నాలేవీ చేయలేదనేది ఆ పార్టీ వర్గం నుంచే వినిపిస్తున్న మాట. ఫలితంగా బీజేపీ ఎన్నికల్లో ఘోరంగా విఫలం అయింది. ఇక ఓటమి తరువాత కిషన్ రెడ్డిని అధ్యక్ష పదవి నుంచే తప్పిస్తారనే వార్తలు ఈ మద్య తెగ వినిపిస్తున్నాయి. మరో మూడు నెలల్లో లోక్ సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కిషన్ రెడ్డి నాయకత్వం బీజేపీకి మైనస్ గా మారకూడదనే ఉద్దేశ్యంతో అధ్యక్ష మార్పు దిశగా బీజేపీ అధిష్టానం మళ్ళీ అడుగులు వేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. తాజాగా బీజేపీ జాతీయ ప్రదాన కార్యదర్శి బీఎల్ సంతోష్ తో కిషన్ రెడ్డి భేటీ కావడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. కిషన్ రెడ్డి స్వయంగా అధ్యక్ష పదవి నుంచి తప్పుకునే ఆలోచనతోనే బీఎల్ సంతోష్ తో భేటీ అయ్యారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం. దీనిపై త్వరలో పార్టీ అధిష్టానంతో కూడా చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఎన్నికల ముందు పార్టీ అధ్యక్ష మార్పు చేపట్టే సాహసం అధిష్టానం చేస్తుందా అనేది చూడాలి.

Also Read:జగన్ టార్గెట్‌గా కాంగ్రెస్?

- Advertisement -