స్కిప్పింగ్ తో ఎన్ని ప్రయోజనాలో..!

79
- Advertisement -

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతిరోజూ వ్యయమనికి తగిన సమయం కేటాయించడం ఎంతో అవసరం. మనం ఆరోగ్యంగా ఉండాలన్న.. మనం చేసే పనిలో చురుకుగా పాల్గొనాలన్నా ప్రతిరోజూ వ్యాయామం చేయడం తప్పనిసరి. అయితే వ్యాయామం కోసం అరగంట కూడా కేటాయించలేని వారు ఉంటారు. అలాంటి వారు ప్రతిరోజూ 10 నుంచి 15 నిముషాల పాటు స్కిప్పింగ్ ( తాడాట ) చేస్తే ఎన్నో ఉపయోగలు ఉన్నాయని ఫిట్ నెస్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అధిక బరువుతో భాడపడే వాళ్ళు స్కిప్పింగ్ తప్పనిసరిగా చేయాలట ఎందుకంటే స్కిప్పింగ్ లో జంప్ చేస్తూ ఉంటాం. ఇలా జంప్ చేయడం వల్ల శరీరంలో పెరుకుపోయిన అనవసర కొవ్వు కరిగిపోతుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి తాడాట ఒక చక్కటి పరిష్కారం.

అంతే కాకుండా స్కిప్పింగ్ వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. తద్వారా మనం చేసే పనిపై ఏకాగ్రత పెరుగుతుంది. స్కిప్పింగ్ వల్ల శరీరభాగలన్నిటికి రక్త ప్రసరణ సవ్యంగా జరుగుతుంది. అందువల్ల ఎలాంటి గుండె సమస్యలు దరిచేరవు. స్కిప్పింగ్ లో శరీర భాగాలన్నీటికి కదలిక వస్తుంది. కాబట్టి అన్నీ అవయవాల పనితీరు మెరుగుపడుతుంది. ఇక కాళ్ళ పటుత్వం పెరుగుతుంది. మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు దూరం అవుతాయి. అంతే కాకుండా శ్వాసను కూడా కంట్రోల్ చేయవచ్చు తద్వారా ఊపిరితిత్తుల సమస్యలు రావు. అందుకే ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం కనీసం 10 నుంచి 15 నిముషాల వ్యవధిలో 500 నుంచి 1000 రౌండ్లు స్కిప్పింగ్ చేస్తే రోజంతా ఎంతో యాక్టివ్ గా ఉంటామని ఫిట్ నెస్ నిపుణులు చెబుతున్నారు.

Also Read: IND VS SA : నేడే కీలక పోరు.. గెలుస్తారా?

- Advertisement -