జగన్ అలా.. రేవంత్ ఇలా?

48
- Advertisement -

తెలంగాణలో ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నాలుగు రోజులకే తన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల ముందు ప్రకటించిన హామీల అమలుకై గట్టిగానే ప్రయత్నిస్తూనే.. ఇంకోవైపు ఆరోగ్యకరమైన రాజకీయాలకు నాంది పలుకుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ ప్రమాదవశాత్తు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. యశోధ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆయనను పరమార్చించేందుకు సి‌ఎం రేవంత్ రెడ్డి స్వయంగా అక్కడికి వెళ్ళడం అందరి దృష్టినీ ఆకర్షించింది. అంతే కాకుండా కే‌సి‌ఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసిన ఆయన.. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కే‌సి‌ఆర్ త్వరగా కోలుకోవాలని, ఆయన సలహాలు సూచనలు కొత్త ప్రభుత్వానికి అందించాలని చెప్పడం కూడా హర్షించాల్సిన విషయం. .

రాజకీయ పరంగా ఎన్ని విభేదాలు ఉన్నప్పటికి అవేవీ వ్యక్తిగతం కాదని రేవంత్ రెడ్డి నిరూపించారని అందరి చేత ప్రశంశలు అందుకుంటున్నారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుందాగా ప్రవర్తిస్తున్న వేళ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఆసుపత్రిలో ఉన్న టైమ్ లో కనీసం ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా అడిగి తెలుసుకోలేదని, ఇంకా చెప్పాలంటే చంద్రబాబుపై జగన్ కక్షపూరితంగా వ్యవహరించారని విమర్శలు గుప్పిస్తున్నారు ఏపీ రాజకీయవాదులు. ఆరోగ్యకరమైన పాలిటిక్స్ ఎలా చేయాలో రేవంత్ రెడ్డి నీ చూసి నేర్చుకోవాలంటూ హితవు పలుకుతున్నారు ఏపీ ప్రజలు. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో రేవంత్ రెడ్డి వైఖరి అందరి ఆశ్చర్య పరుస్తోందనే చెప్పాలి. మరి ముందు రోజుల్లో కూడా రేవంత్ రెడ్డి ఇలాగే ఉంటారా లేదా ? తనలోని మరో కోణాన్ని బయటకు తీస్తారా అనేది చూడాలి.

Also Read:కేసీఆర్‌కు చంద్రబాబు పరామర్శ

- Advertisement -