పవన్ పై పోటీ.. జగన్ మాస్టర్ స్కెచ్ !

13
- Advertisement -

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసే స్థానంపై ఇంకా ఎలాంటి స్పష్టత రానప్పటికి.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం పవన్ సీటు విషయంలో పక్కా ప్రణాళిక బద్దంగా ఉన్నారని తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన పవన్.. రెండు చోట్ల కూడా వైసీపీ అభ్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు. అదేవిధంగా ఈసారి ఎన్నికల్లో కూడా మరోసారి వైసీపీ చేతిలోనే పవన్ ఓడిపోయేలా జగన్ వ్యూహాలు రచిస్తున్నారట. అందులో భాగంగానే పవన్ ఎక్కడి నుంచి పోటీ చేసిన అదే స్థానంలో ధీటైన అభ్యర్థిని బరిలో దించే ప్లాన్ లో ఉన్నారట. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం పవన్ పిఠాపురం నుంచి పోటీ చేయనున్నట్లు వినికిడి. ఒకవేళ జనసేనాని అదే స్థానం నుంచి బరిలోకి దిగితే.. అక్కడ వైసీపీ తరుపున ముద్రగడ పద్మనాభం ను బరిలో దించే ఆలోచనలో జగన్ ఉన్నారట. .

గత కొన్నాళ్లుగా ముద్రగడ జనసేనలో చేరతారనే టాక్ వచ్చినప్పటీకి.. ప్రస్తుతం ఆయన జనసేనకు దూరంగా ఉండేందుకే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముద్రగడను వైసీపీలో చేర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ముద్రగడను వైసీపీలో చేర్చుకొని పవన్ కు పోటీగా బరిలోకి దించితే వైసీపీకి మేలని భావిస్తున్నారట అధినేత జగన్మోహన్ రెడ్డి. కాపు ఓటు బ్యాంకే ప్రధానంగా పవన్ సీటు ఎన్నుకునే అవకాశం ఉంది. అందువల్ల కాపుల్లో మంచి పట్టు ఉన్న ముద్రగడను బరిలోకి దించితే కాపుల మద్దతు తప్పక లభిస్తుందనే అభిప్రాయం వైసీపీ క్యాడర్ లో ఉంది. అందువల్ల ఒకవేళ ముద్రగడ పవన్ కు పోటీగా ఎన్నికల బరిలో నిలిస్తే ఇద్దరి మద్య పోరు రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది. గతంలో ప్రజారాజ్యం పార్టీలో పార్టీలో మెగా ఫ్యామిలీకి మద్దతుగా నిలిచిన ముద్రగడ.. ఇప్పుడు పవన్ కూడా పోటీగా నిలిస్తే కాపు ఓటు బ్యాంకులో చీలిక ఏర్పడడం గ్యారెంటీ. మరి ముద్రగడ నిజంగానే వైసీపీ గూటికి చేరతారా ? పవన్ కు పోటీగా నిలుస్తారా ? అనేది ముందు ర్తోజుల్లో తేలనుంది.

Also Read:Modi:తెలంగాణకు మోడీ.. క్లారిటీ వచ్చేనా?

- Advertisement -