బాంబులు వేసే బీజేపీ వద్దు.. బతుకు దేరువు చూపే టీఅర్ఎస్ ముద్దు..

156
jagadish reddy
- Advertisement -

బీజేపీ,కాంగ్రెస్,యంఐయం లవి చీకటి ఒప్పందాలు. అభివృద్ధిని పక్కదారి పట్టించేందుకు కుట్రలు చేస్తున్నాయిని మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బియన్ రెడ్డి డివిజన్‌ కాలనీ సంక్షేమ సంఘాలతో మంత్రి జగదీష్‌రెడ్డి ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాంబులు వేసే బీజేపీ వద్దు…బతుకు దేరువు చూపే టీఅర్ఎస్ ముద్దు.. అన్నారు. 2014 తరువాత టీఅర్ఎస్ ఏ పార్టీతో పొత్తుకు పోలేదు ఒంటరిగా జీహెచ్ఎంసీలో పోటీ చేస్తున్న ఏకైక పార్టీ టీఅర్ఎస్ అన్నారు.150కి 150 స్థానాలలో బరిలోకి దిగింది టీఅర్ఎస్ ఒక్కటే. అన్ని డివిజన్లలో పోటీ చెయ్యలేక పరస్పర ఒప్పందంతో బరిలోకి దిగింది విపక్షాలే అటువంటి పార్టీలకు గుణపాఠం చెప్పాలని మంత్రి కోరారు.

అనంతరం ఎల్బి నగర్ డివిజన్ పరిధిలోని వనస్థలిపురంలో టీఅర్ఎస్‌కు మద్దతుగా ప్రయివేటు ట్రావెల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, రాష్ట్ర వికలాంగుల కార్పోరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి,మునుగోడు మాజీ శాసనసభ్యుడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -