బిగ్ బాస్ 3 ప్రారంభమయ్యి రెండు వారాలు గడిచింది. హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన 15మంది కంటెస్టెంట్స్ లో ఇప్పటికే ఇద్దరు ఎలిమినెట్ అయ్యారు. గత వారం నటి హేమ ఎలిమినెట్ కాగా, ఈవారం ప్రముఖ యాంకర్ జాఫర్ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినెట్ అయ్యారు. ఎలిమినేషన్లో ఉన్న అందరికంటే జాఫర్‌కే తక్కువ ఓట్లు రావడంతో హౌస్ నుంచి బయటకు వెళ్లకతప్పలేదు. రాహుల్, మహేశ్ విట్టా, వరుణ్ సందేశ్, వితికా శెరు, పునర్నవి, శ్రీముఖి, హిమజ ఎలిమినేషన్‌కు నామినేట్ కాగా, వీరిందరూ సేఫ్ జోన్లోకి వెళ్లారు.
హౌస్ నుంచి బయటకు వచ్చాక నాగార్జున తో మాట్లాడారు జాఫర్. బిగ్ బాస్ హౌస్ లో గ్రూపులు ఉన్నాయన్నారు . తనకు అవకాశం వస్తే మళ్లీ హౌస్ లోకి వస్తానని చెప్పారు. శనివారం రోజు నలుగురు సభ్యులను సేవ్ చేయగా..ఆదివారం రోజు ఎలిమినేట్ అయ్యే వ్యక్తి పేరును చెప్పారు నాగార్జున. జాఫర్, పునర్ణవి, వరుణ్, వితికలో మొదటగా పునర్ణవి సేవ్ అయినట్లు తెలిపారు.
ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ టీం రామ్ , నిధి అగర్వాల్ గెస్ట్ గా వచ్చారు. ఈసారి సేఫ్ చేసే అవకాశం రామ్ కి ఇచ్చారు నాగార్జున. రామ్ వరుణ్ సేఫ్ అవుతున్నట్లు ప్రకటించాడు. ఆ తర్వాత మిగిలింది వితికా, జాఫర్. చివర్లో నాగార్జున ఇంటి సభ్యుల అభిప్రాయాన్ని అడగగా 7గురు జాఫర్ కు మద్దతు తెలిపారు. 6 గురు వితికని సపోర్ట్ చేశారు. కానీ ప్రేక్షకుల ఓట్ల ప్రకారం జాఫర్ ఎలిమినేట్ అవుతున్నట్లు నాగార్జున ప్రకటించాడు