జబర్దస్త్ కి దిష్టి తగిలిందట!

76
- Advertisement -

ఇదేంటి జబర్దస్త్ గా నడుస్తున్న జబర్దస్త్ షో కి దిష్టి తగలడం ఏమిటి ? అసలేమైంది అనుకుంటున్నారా? విషయంలోకి వెళితే ఒకప్పుడు జబర్దస్త్ లో కమెడియన్స్ అంతా కలిసి మెలిసి ఉంటూ అందరికీ వినోదం పంచేవారు. కానీ సెలెబ్రిటీ హోదా వచ్చాక నాలుగు డబ్బులు కనబడే సరికి కమెడియన్స్ ఈ షో నుండి ఒక్కొక్కరు దూరమవుతూ వస్తున్నారు. ఇగో క్లాష్ తో ఒకరినొకరు ద్వేషించుకుంటూ అలాగే షో గురించి తప్పుగా మాట్లాడుతూ మీడియా కెక్కుతున్నారు. అందుకే జబర్దస్త్ తో కాసింత గుర్తింపు తెచ్చుకొని ఆ ఇమేజ్ తో కెరీర్ కొనసాగిస్తున్న అదిరే అభి ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. మరి అభి మనసులో మాటలు ఈ అక్షరాల రూపంలో చదివి తెలుసుకోండి.

మా జబర్దస్త్ కి దిష్టి తగిలింది

జబ్బలు చరుచుకుంటూ నవ్వే జడ్జీలు, టైమింగ్ తో పంచులేసే టీం లీడర్లు
కామెడిని అవపోసన పట్టిన కంటెస్టెంట్లు, అందరికి అన్నం పెట్టె అమ్మ లాంటి మల్లెమాల
ఇది కదా మా కుటుంబం.

కలిసి ఉన్నప్పుడు కష్టం తెలిసేది కాదు, సమయం ఆగేది కాదు.
కుశల ప్రశ్నలు, ఆపన్నహస్తలు ,
జోకుల మీద జోకులు, స్టూడియో దాటే నవ్వులు.
బాబు గారి హుందాతనం, రోజా గారి చిలిపితనం,
అనసూయ-రష్మిల అందం, స్కిట్ల మాయాజాలం.
స్టేజి ఎక్కేవరకు రిహార్సల్లు, ఎక్కాక సొంత పంచులు.
పోస్టర్ అఫ్ ది డే కోసం పోజులు. పాతికవేల చెక్కుతో ఫోటోలు.
జడ్జీల వేసే కౌంటర్లు, కామెంట్లు, కాంప్లిమెంట్లు, సలహాలు, సూచనలు.

ఎవరి దిష్టి తగిలిందో, ఏక తాటి మీద నడిచిన మాకు ఎవరి దారి వారిదయ్యింది.
ఎవడైనా పల్లెత్తి మాటంటే పడని మేము, మమ్మల్ని మేమె మాటలు అనుకుంటున్నాం.
సమయం వెనక్కెళ్ళితే బాగుండు, ఆ రోజులు తిరిగి వస్తే బాగుండు.
అందర్నీ నవ్వించే జబర్దస్త్ కి, మళ్ళి నవ్వేరోజులు వస్తే బాగుండు.

-అదిరే అభి

అంటూ అభినవ్ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. మరి ఈ పోస్ట్ కి రెస్పాన్స్ కూడా బాగానే వస్తుంది. మీలో మీరు తగువులు పడుతూ ఒక్కొక్కరు విడిపోవడం బాలేదని, త్వరలోనే మీ అందరినీ మళ్లీ జబర్దస్త్ లో చూడాలని ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి…

బాలయ్య హ్యాట్రిక్ కొడతాడా?

ధోని తొలి ఎంటర్‌టైనర్ ఎల్‌జిఎం..

‘భోళా శంకర్’కి వాయిదా తప్పదా

- Advertisement -