బాలయ్య హ్యాట్రిక్ కొడతాడా?

43
- Advertisement -

నందమూరి బాలకృష్ణ కి ప్రస్తుతం శుక్ర మహర్దశ నడుస్తుంది. ‘లెజెండ్’ తర్వాత ఆ స్థాయి సక్సెస్ అందుకోలేక సతమత పడుతున్న బాలయ్య కి ‘అఖండ’ రూపంలో అఖండ విజయం దక్కింది. ఏపీలో తక్కువ టికెట్ ధరతో జీవో ఉన్న టైమ్ లో కూడా సినిమా మంచి రెవెన్యూ రాబట్టి బాలయ్య మాస్ ఇమేజ్ ఏంటో నిరూపించింది.

‘అఖండ’ తర్వాత బాలయ్య నుండి వచ్చిన ‘వీర సింహా రెడ్డి’ కూడా ఆ స్థాయి విజయం దక్కించుకొని సంక్రాంతి పోటీలో సక్సెస్ అనిపించుకుంది. బాలయ్య మాస్ కంటెంట్ తో థియేటర్స్ లోకి ఎంట్రీ ఇవ్వడమే ఆలస్యం అభిమానులు , సినిమా లవర్స్ కలెక్షన్స్ ఇచ్చేందుకు రెడీ ఉంటారన్నట్టుగా అఖండ , వీర సింహా రెడ్డి కలెక్షన్స్ ఋజువుచేశాయి.

ఏదేమైనా సీనియర్ హీరోల్లో ఈ మధ్య కాలంలో ఇలా వరుసగా రెండు బ్లాక్ బస్టర్స్ కొట్టింది ఒక్క బాలయ్యే. చిరంజీవి ఖైదీ నంబర్ 150 తర్వాత మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ అవేవీ పెద్ద హిట్ అవ్వలేదు. ‘ఖైదీ నంబర్ 15’0 కి ‘వాల్తేరు వీరయ్య’ కి మధ్య రెండు ఫ్లాపులు , ఒక యావరేజ్ సినిమాలున్నాయి. ఇక వెంకీ , నాగార్జున లో ఎవరూ ఈ మధ్య కాలంలో వరుస బ్లాక్ బస్టర్స్ కొట్టింది లేదు. ఏదేమైనా బాలయ్య కి ఇప్పుడు అన్నీ కలిసొస్తున్నాయి. మరి అనిల్ రావిపూడితో బాలయ్య చేస్తున్న nbk108 కూడా బ్లాక్ బస్టర్ కొడితే హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్నట్టే.

ఇవి కూడా చదవండి…

పవన్ ఎపిసోడ్ రిలీజ్ డేట్ ఫిక్స్

ధోని తొలి ఎంటర్‌టైనర్ ఎల్‌జిఎం..

‘భోళా శంకర్’కి వాయిదా తప్పదా

- Advertisement -