మెగాస్టార్ చిరంజీవి – మెహర్ రమేష్ కలయికలో రాబోతున్న భోళా శంకర్ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో వస్తోన్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14 రిలీజ్ చేయాలని నిర్ణయించారు. అయితే, ఇదే బ్యానర్ లో అఖిల్ హీరోగా ‘ఏజెంట్’ అనే సినిమా కూడా ఇదే రోజున విడుదల కానుంది. కాబట్టి ఒకే బ్యానర్ లో అది కూడా మెగాస్టార్ చిరంజీవి సినిమాకి పోటీగా అఖిల్ అక్కినేని సినిమాని రిలీజ్ చేయాలని మేకర్స్ భావించడం లేదు.
ఈ నేపథ్యంలోనే మే నెలలో భోళా శంకర్’ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు మూవీ మేకర్స్. ఇక ఈ సినిమా భారీ సక్సెస్ కావాలంటే.. సిస్టర్ సెంటిమెంట్ తో పాటు భారీ యాక్షన్ టచ్ కూడా ఉండాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. అందుకే.. తమిళ సినిమా రీమేక్ అయినప్పటికీ.. రాయలసీమ ఫ్యాక్షన్, మైనింగ్ ఇలాంటి వ్యవహారాలను ఈ చిత్రంలో జోడించబోతున్నారు. ఈ సీన్స్ లో మెగాస్టార్ మాస్ ఎలివేషన్లు హైలైట్ గా ఉంటాయట.
ఎలాగూ దర్శకుడు మెహర్ రమేష్ కి మాస్ ఎలివేషన్లు బాగా హ్యాండిల్ చేస్తాడని మంచి పేరు ఉంది. పైగా ఇలాంటి మాస్ ఎలివేషన్లలో మెగాస్టార్ చిరంజీవి కూడా అదిరిపోతారు. గతంలో చిరు సినిమాలు హిట్ అయిందే ఆ ఎలివేషన్లతో. మొత్తానికి ఇన్నాళ్లకు మళ్లీ మెగాస్టార్ ఫుల్ ఎలివేషన్లలో కనిపించబోతున్నారు.
ఇవి కూడా చదవండి…

