జీఈ సదస్సులో భాగంగా హైదరాబాద్ నగరానికి విచ్చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూతురు ఇవాంక చారిత్రక గోల్కొండ కోటను సందర్శించనుంది. మనదేశాన్ని పరిపాలించిన ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్-2 ప్రిన్స్‌తో కలిసి 1983 సంవత్సరం నవంబర్ 19న సందర్శించారు. రెండేళ్ల క్రితం డిసెంబర్‌లో మారిషస్ అధ్యక్షురాలు డాక్టర్ ఆమీనా గరీబ్‌ఫకీం కోటను సందర్శించారు. ఇక చిన్న, చిన్న దేశాల అధినేతలు చాలా మంది సందర్శించారు. రాష్ట్రపతులు జ్ఞానీ జైల్‌సింగ్, ఆర్.వెంకటరామన్ గోల్కొండను సందర్శించారు.
కాకతీయుల కాలంలో నిర్మితమైన ఈ కోట అసలు పేరు గొల్లకొండ. ఆ తర్వాత కాకతీయులను ఓడించిన బహుమనీయులు వారిని ఓడించి కులికుతుబ్‌షాహీలు పరిపాలన చేశారు. గొల్లకొండను గోల్కొండగా నామకరణం చేసి మట్టికోటను రాతికోటగా శత్రు దుర్బేద్యంగా మార్చారు.
తర్వాత మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ గోల్కొండ కోటను వశపరుచుకున్నాడు. నిజాం నవాబులను తన పాలకులుగా ఏర్పాటు చేసి ఔరంగబాద్ వెళ్లిపోయారు. అప్పటికే కులికుతుబ్‌షా రాజులు చార్మినార్ కేంద్రంగా భాగ్యనగరం నిర్మించడంతో నిజాం నవాబులు అక్కడి నుంచి పరిపాలన చేశారు. భాగ్యనరమే నేడు హైదరాబాద్ నగరంగా పిలవబడుతుంది.
నిజాం తర్వాత 1948లో ఇండియన్ పోలీసు యాక్షన్‌తో హైదరాబాద్‌ను అఖండ్ భారత్‌లో విలీనం చేశారు. గోల్కొండ కేంద్రంగానే నాడు రాజులందరు ఇటు ఉమ్మడి తెలుగురాష్ట్రాలను, దక్షిణ మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటకను కలిపి పరిపాలించారు. ఇంతటి చరిత్ర కలిగిన ఈ కోటను దేశ విదేశీ ప్రతినిధులు ఎంతో మంది సందర్శించారు.