రియల్ హీరో సోనూ సూద్ ఇల్లు,ఆయన కంపెనీలపై ఐటీ శాఖ తనిఖీలు నిర్వహించింది. ముంబైలోని సోనూ ఇంట్లోకి వెళ్లి తనిఖీలు చేపట్టారు. అలాగే ఆయన ఆఫీసు సహా సోనూకి చెందిన 6 ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ ఆకస్మిక పరిణామంతో సోనూ షాకయ్యారు.
కరోనా విపత్కర సమయంలో దేశం మొత్తం సోనూ సేవలు చూసి ఫిదా అయింది. పలువురు సినీ, రాజకీయ సెలబ్రిటీలు సైతం సోనూ సేవలను కొనియాడారు. ఈ క్రమంలో ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఐటీ దాడులు జరగడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
ఢిల్లీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన పాఠశాల విద్యార్థుల మెంటార్ షిప్ ప్రోగ్రాంకు.. సోనూసూద్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది కేజ్రీవాల్ ప్రభుత్వం. అంతకు ముందు పంజాబ్ ప్రభుత్వంలో కూడా కరోనాపై అవగాహన కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఈ రెండు ప్రభుత్వాలు కూడా బీజేపీకి~వ్యతిరేకంగా ఉన్నవే. ఇలాంటి టైంలో ఐటీ దాడులు జరగడం పలు ఊహాగానాలకు దారితీస్తోంది.