ప్రగతిభవన్‌లో కేబినెట్ భేటీ..

48
KCR

తెలంగాణ కేబినెట్ సమావేశం నేడు జరగనుంది. ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలు, దళిత బంధు పథకానికి చట్టబద్ధత కల్పించడం, మార్గదర్శకాల రూపకల్పన, నాలుగు మండలాల్లో దళిత బంధు పథక ప్రారంభ తేదీలను నిర్ణయించనున్నారు. అలాగే కరోనా థర్డ్‌ వేవ్‌ తదితర అంశాలపై చర్చ జరగనుంది. వీటితో పాటు విద్యా శాఖకు సంబంధించి పలు అంశాలు చర్చకు రానున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు 19-ఏ ప్యాకేజీలో భాగంగా సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల డీపీఆర్‌లకు కేబినేట్‌ ఆమోదం తెలుపనుంది.