హీరో విజయ్‌కి మరోసారి ఐటీ షాక్‌..

505
vijay
- Advertisement -

కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ కి ఐటీ అధికారులు మరోసారి షాక్ ఇచ్చారు.ఈ రోజు చెన్నైలోని విజయ్‌ నివాసంలో ఐటీ అధికారులు మళ్లీ సోదాలు నిర్వహించారు. గత నెలలోనూ విజయ్‌ ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. గత దాడులకు కొనసాగింపుగానే ఈ తనిఖీలు చేపట్టినట్లు కోలీవుడ్‌ సమాచారం.

గతంలో విజయ్‌ నటించిన బిగిల్ చిత్రాన్ని తెరకెక్కించిన ఏజీఎస్ సంస్థ కార్యాలయాలు, సంస్థకు చెందిన వ్యక్తులు తదితరుల ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. ఇప్పడు మళ్లీ ఐటీ దాడులు జరగడం కోలీవుడ్ లో సంచలనంగా మారింది. ప్రస్తుతం విజయ్‌ మాస్టర్ సినిమా ష్యూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

- Advertisement -