విజయ్‌తో వంశీ పైడిపల్లి మూవీ ఖరారు..

36
Vamshi Paidipally

తమిళ హీరో ఇళయదళపతి విజయ్‌తో చిత్రం తెరకెక్కించబోతున్నట్టు వంశీ పైడిపల్లి తాజాగా ఖరారు చేశారు. ఈ మధ్య వీరి కాంబినేషన్‌లో ఓ ద్విభాషా చిత్రం రూపొందబోతోందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో అటు విజయ్ గానీ ఇటు దర్శకుడు వంశీ పైడిపల్లి గానీ స్పందించలేదు. దాంతో ఇది కేవలం రూమరే అనే టాక్ వినిపించింది.

అయితే తాజాగా విజయ్‌తో తన సినిమా ఉండబోతోందని, ఈ ప్రాజెక్ట్‌ను దిల్ రాజు నిర్మించబోతున్నట్టు తెలిపారు. కరోనా పరిస్థితులు చక్కబడగానే దీనికి సంబంధించిన అధికారక ప్రకటన రానుంది. కాగా విజయ్‌కి టాలీవుడ్‌లో ఇదే మొదటి సినిమా కావడం విశేషం. కాగా, దళపతి విజయ్‌కి తెలుగులోనూ మార్కెట్ పెరుగుతున్న ఈ టైమ్‌లో వంశీ పైడిపల్లి అతడితో భారీ సినిమాని ప్లాన్ చేస్తుండడం ఆసక్తిని కలిగిస్తోంది. ఈ చిత్రానికి 200 కోట్ల బడ్జెట్ పెట్టినా వర్కవుటయ్యే ఛాన్సుందనేది ఓ అంచనా. మరి దిల్ రాజు ఏ రేంజులో ప్లాన్ చేస్తారన్నది వేచి చూడాలి.