ఇస్రో మరో ప్రయోగం..కక్ష్యలోకి 11 ఉపగ్రహాలు

383
Isro
- Advertisement -

అంతర్జాతీయ పరిశోధన సంస్ధ ఇస్రో మరో ప్రయోగానికి సిద్దమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోట సార్ కేంద్ర నుంచి ఇవాళ మధ్యాహ్నం 3.25గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సి 48 వాహకనౌకను నింగిలోకి పంపించనున్నారు శాస్త్రవేత్తలు. ఇస్రో 11 ఉపగ్రహాలను నింగిలోకి పంపిస్తోంది. నిన్న సాయంత్రం 4.40గంటలకే కౌంట్ డౌన్ ప్రారంభంఅయింది. వాస్తవానికి 4.25గంటలకు ప్రారంభంకావాల్సిన కౌంట్ డౌన్ కొంత ఆలస్యంగా ప్రారంభించారు.

రాహు కాలం ఉన్నందుకు కాస్త ఆలస్యంగా ప్రారంభించినట్లు సమచారం. పీఎస్‌ఎల్‌వీ-సి48 వాహకనౌక మనదేశానికి చెందిన రీశాట్‌-2బీఆర్‌1తో పాటు విదేశాలకు చెందిన 9ఉపగ్రహాలను నిర్ణీతకక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఇస్రో చరిత్రలో పీఎస్‌ఎల్వీ సీ-48 ప్రయోగం ప్రతిష్టాత్మకమైంది. పీఎస్‌ఎల్వీ వాహక నౌకకు ఇది 50వ ప్రయోగం కాగా.. శ్రీహరికోట నుంచి 75వ ప్రయోగం కావడం విశేషం.

- Advertisement -