వాంఖడేలో కింగ్ ఎవరో..!

326
india vs westindies

భారత్- వెస్టిండీస్ మధ్య కీలకమైన చివరి మూడో టీ20 ఇవాళ జరగనుంది. సాయంత్రం 7 గంటలకు ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారు సిరీస్ విజేతగా నిలవనున్నారు. దీంతో వాంఖడేలో కింగ్‌ ఎవరోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది.

అయితే స్పోర్ట్స్ ఎనలిస్టులు మాత్రం ఇండియా విజయావకాశాలు ఎక్కువని అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే సిరీస్ డిసైడ్ మ్యాచ్‌ల్లో భారత్‌కు మెరుగైన రికార్డు ఉంది. దీనికితోడు వాంఖడే పిచ్‌పై రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శివమ్ దూబేకి అనుభవం ఉండటం కలిసొస్తుందని మెనేజ్‌మెంట్ భావిస్తోంది.

మూడో టీ20లో భారత్ పలు మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. వాషింగ్టన్ సుందర్‌ స్ధానంలో కుల్దీప్ యాదవ్‌కి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు దాదాపుగా దూరమైన శిఖర్ ధావన్ స్థానంలో మయాంక్ అగర్వాల్ ఎంపికయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు రెండో టీ20 విజయంతో జోష్ మీదున్న విండీస్ ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ నెగ్గాలని భావిస్తోంది. కీరన్ పొలార్డ్, హిట్టర్ నికోలస్ పూరన్‌,ఎవిన్ లావిస్ ముంబయి ఇండియన్స్‌ ఆడిన అనుభవం ఉండటంతో పాటు బౌలింగ్‌లో విలియమ్స్, వాల్ష్ మంచి ఊపుమీదున్నారు. దీంతో విజయంపై విండీస్ కూడా ధీమాగా ఉంది.

ఇక టీ20 సిరీస్ ముగిశాక మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈనెల 15న చెన్నైలో తొలి వన్డే,18న విశాఖపట్నంలో రెండో వన్డే, 22న కటక్‌లో మూడో మ్యాచ్ జరగనుంది.

India vs West Indies, 3rd T20I – Live Cricket Score, CommentarySeries: West Indies tour of India, 2019 Venue: Wankhede Stadium,Mumbai