నేలపై పడుకోవడం..మంచిదేనా?

33
- Advertisement -

నిద్రపోయే విషయంలో చాలామంది మెత్తటి పరుపుపై సుఖమయమైన నిద్ర పోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతుంటారు. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు పని ఒత్తిడిలో పడి రాత్రిపూట ప్రశాంతంగా నిద్ర పోవాలని అందరూ భావిస్తారు. సుఖమైన నిద్ర రావాలంటే పడుకునే బెడ్ ఎంతో సౌకర్యవంతంగా ఉండేలా చూసుకుంటారు. కొందరు బెడ్ పై కంటే నేలపై పడుకునే అలవాటు కూడా ఉంటుంది. అయితే చాలామంది నేలపై పడుకోవడానికి ఏ మాత్రం ఇంట్రెస్ట్ చూపరు. నిజానికి నేలపై పడుకుంటే ఎన్నో లాభాలు ఉన్నాయని చెబుతున్నారు కొందరు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా నేలపై పడుకోవడం వల్ల వెన్నెముక ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుందట. తద్వారా వెన్నునొప్పి, నడుం నొప్పి సమస్యలు దూరమౌతాయట. ఇంకా నేలపై సరైన భంగిమల్లో పడుకోవడం వల్ల రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుందట. .

బెడ్ పై పడుకున్న వారికి ఉదయం నిద్ర లేచిన తరువాత మెడ నొప్పి, మోకాళ్ళ నొప్పులు వంటివి కనిపిస్తుంటాయి. కానీ నేలపై పడుకుంటే అలాంటి సమస్యలు రావట. అయితే నేలపై పడుకోవడం వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయట. నేలపై ఒకే భంగిమలో పడుకోవడం వల్ల కండరాలు పట్టేయడం, తిమ్మిర్లు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు నేలపై పడుకోవడం అంతా మంచిది కాదని నిపుణులు చెబుతున్నా మాట. అంతే కాకుండా నేలపై పడుకోవడం వల్ల పురుగులు, ఇతరత్రా కీటకాలు శరీరానికి హాని కలిగించే అవకాశం ఉంది. ఇంకా ఒట్టి నేలపై పడుకున్నప్పుడు నేల ఉష్ణోగ్రత శరీరంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందువల్ల నేలపై పడుకునే విషయంలో పరిసరాలను శుబ్రంగా ఉంచుకుని ఒట్టి నేలపై కాకుండా బెడ్ షీట్ వేసుకొని పడుకోవడం మంచిది. గర్భిణీ స్త్రీలు మినహా మిగిలిన వారు నేలపై పడుకునేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని పడుకోవడం మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

Also Read:Bhumana:హిందూ ధర్మంలోకి ఇతర మతస్తులకు స్వాగతం

- Advertisement -