TS కాదు TG.. ఏంటి ఉపయోగం?

35
- Advertisement -

తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వాహన రిజిస్ట్రేషన్ లలో ‘టీఎస్’ కు బదులుగా ‘టీజీ’ ని ప్రవేశ పెడుతున్నట్లుగా నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఈ మార్పు చేయాల్సిన అవసరమెంటని ప్రశ్నిస్తున్నారు చాలమంది. టీఎస్ గా ఉన్న దానిని టీజీగా మర్చినంత మాత్రాన రాష్ట్రానికి వచ్చే ఉపయోగం ఏంటనే విమర్శలు వ్యక్తమౌతున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక మునుపు ఉద్యమ సమయంలో ‘టీజీ’ గానే వాహనాలకు వాడుతూ వచ్చారు. కానీ బి‌ఆర్‌ఎస్ అధికారం చేపట్టిన తరువాత తెలంగాణ స్టేట్ ను సూచించేలా ‘టీఎస్’ గా మార్చారు అప్పటి ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్. .

అయితే ఇప్పుడు మళ్ళీ వాహన రిజిస్ట్రేషన్ లకు టీజీగా మార్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం మొగ్గు చూపడంతో దీనికి ఎవరు అభ్యంతరాలు వ్యక్తం చేయనప్పటికి.. ఇప్పటికిప్పుడు మార్చాల్సిన అవసరం ఏముందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. వంద రోజుల్లో ఇచ్చిన హామీలను పూర్తి చేస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కార్ వాటిపై దృష్టి పెట్టకుండా ‘టీఎస్’ ను ‘టీజీ’ మార్చడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి సర్కార్ చేసిన ఈ మార్పు వెనుక వ్యూహం ఉందనేది విశ్లేషకులు చెబుతున్న మాట. గత బి‌ఆర్‌ఎస్ హయంలో జరిగిన అభివృద్ది, మార్పులు ప్రజల్లో సుస్థిర స్థానం సంపాధించుకున్నాయి. ఈ నేపథ్యంలో తమ పాలనలో కూడా వైవిధ్యం ఉంటుందని చెప్పేందుకే సి‌ఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొందరి అభిప్రాయం. ఏది ఏమైనప్పటికి ‘టీఎస్’ ను ‘టీజీ’ మార్చడంపై నెట్టింట అరకొర విమర్శలు వ్యక్తమౌతున్నాయి.

- Advertisement -