సినీ ఇండస్ట్రీలో చాలామంది స్టార్స్ పెళ్లిచేసుకొని చాలా తక్కువ వ్యవధిలోనే విడిపోతుంటారు. ఇప్పుడు ఈ కోవలో మరోజంట చేరారు. శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా తాము సెపరేట్ అవుతున్నామని, దయచేసి తమ నిర్ణయాన్ని సపోర్ట్ చేయాలనీ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు. సెపరేట్ అంటే డివోర్సా అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బూతు సినిమాలు తీస్తే విడిపోక.. నీతోనే కలిసి ఉంటారా ? అంటూ నెటిజన్లు రాజ్ కుంద్రా పై
రెచ్చి పోతున్నారు.
బాలీవుడ్ లో నటిగా శిల్పాశెట్టికి.. ప్రముఖ వ్యాపారవేత్తగా రాజ్ కుంద్రాకి మంచి పేరు ఉంది. పైగా రాజ్ కుంద్రా ‘UT69’ అనే మూవీతో హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వనున్నాడు. అన్నట్టు ఈ మూవీ ప్రమోషన్‌లో రాజ్ కుంద్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ”నేను నటుడిగా మారుతానని చెప్పినపుడు శిల్పా ఒక్కసారిగా నా పైకి చెప్పు విసిరింది. కాసేపు షాక్‌లోకి వెళ్లిన నేను వెంటనే తెరుకున్నాను. డైరెక్టర్ షానవాజ్ చెప్పిన కథను స్పష్టంగా వివరించిన తర్వాత ఆమె ఒకే చెప్పింది” అని అన్నాడు.
అంటే.. రాజ్ కుంద్రా చేయబోయే సినిమాకి కూడా శిల్పా శెట్టి అంగీకారం తెలిపింది. ఈ విషయాన్ని నేరుగా రాజ్ కుంద్రా కూడా చెప్పాడు. మరి అంతలోనే ఏమైందో ఏమో.. ఈ జంట విడిపోవాలని నిర్ణయం తీసుకుంది. నిజానికీ శిల్పాశెట్టికి – ఆమె భర్త రాజ్ కుంద్రాకి మధ్య గొడవలు జరుగుతున్నాయని, వారిద్దరూ విడిపోతున్నారు అంటూ ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలే నిజం అయ్యాయి.
Also Read:టైగర్ నాగేశ్వరరావు..ట్విట్టర్ రివ్యూ