రేవంత్.. బాబును ‘బందీ’ చేస్తారా?

20
- Advertisement -

పార్లమెంట్ ఎన్నికల వేల తెలంగాణలో భూ కొంభకోణం ఒక్కసారిగా హాట్ టాపిక్ అవుతోంది. ఐఎంజీ భారత్ భూ కుంభకోణంపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ హైకోర్టు తీర్పునిచ్చిన వేళ ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. 2003 లో చంద్రబాబు రూ.50 వేల కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడినట్లు ప్రతిపక్షాలు రుజువులతో సహా బయట పెడుతున్నాయి. 2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రూ.50 వేల కోట్ల విలువైన 850 ఎకరాల భూములను ఐఎంజి భారత్ అనే కంపెనీకి అప్పజెప్పినట్లు బి‌ఆర్‌ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. ఎకరం రూ.10 కోట్ల విలువైన భూములను కేవలం రూ.50 వేలకే చంద్రబాబు కేటాయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ఈ భారీ కుంభకోణం విషయంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్ ఎలా వ్యవహరించబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత తెలంగాణ సి‌ఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుకు శిష్యుడనే సంగతి అందరికి తెలిసిందే. తనకు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబేనని స్వయంగా రేవంత్ రెడ్డి ఎన్నో సార్లు చెప్పుకొచ్చారు కూడా. ఇక కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ తను ఎప్పుడు చంద్రబాబు విధేయుడిగానే ఉంటానని ఆయన చెప్పిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో భూ కుంభకోణం విషయంలో తన గురువు చంద్రబాబుపై రేవంత్ రెడ్డి విచారణకు అధెశిస్తారా లేదా అనేది హాట్ హాట్ డిబేట్లక్లు దారి తీస్తోంది.

గత బి‌ఆర్‌ఎస్ హయంలో ఎలాంటి అవినీతి లేకపోయినప్పటికి ఎన్నో కుంభకోణాలు జరిగాయని నిరాధార ఆరోపణలు చేస్తున్న రేవంత్ సర్కార్.. ఆధారాలతో బయటపడ్డ చంద్రబాబు భూ స్కామ్ విషయంలో ఇంతవరకు స్పందించకపోవడం గమనించాల్సిన అంశం. మరి నిత్యం కే‌సి‌ఆర్ ను బందీ చేస్తామని చెప్పే హస్తం నేతలు భూ స్కామ్ విషయంలో చంద్రబాబును అరెస్టు చేయగలరా ? ఆ స్కామ్ ను తేటతెల్లం చేయగలరా ? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. మరి ఈ ప్రశ్నలకు రేవంత్ రెడ్డి ఎలా సమాధానం ,చెబుతారో చూడాలి.

Also Read:Rohith:రోహిత్ రిటైర్మెంట్ అప్పుడే!

- Advertisement -