పొన్నం ఎఫెక్ట్.. కాంగ్రెస్ కు తగలనుందా?

63
- Advertisement -

టి కాంగ్రెస్ గత కొన్ని వరుస సమావేశాలతో దూకుడు మీద ఉంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పట్టు కోసం ప్రయత్నిస్తున్న హస్తం పార్టీ.. అందుకు తగ్గట్టుగానే వ్యూహాలను సిద్దం చేసుకుంటుంది. ఇప్పటికే పార్టీలో వివిధ కమిటీలు ఏర్పాటు చేసి ఆయా నేతలకు కీలక బాద్యతలు అప్పగించింది. ముఖ్యంగా ఇటీవల ఎన్నికల కమిటీని ఏర్పాటు చేసి సీనియర్ నేతలలో చాలమందికి చోటు కల్పించింది. ఎన్నికల కమిటీ చైర్మెన్ గా రేవంత్ రెడ్డిని నియమించగా.. ఇన్నాళ్ళు పార్టీలో ఏ మాత్రం యాక్టివ్ గా లేని వారికి చోటు కల్పించడం గమనార్హం..

చోటు దక్కిన వారిలో మహ్మద్ అజరుద్దీన్, రేణుకా చౌదరి వంటి వారితో పాటు, ఈ మద్యనే పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కూడా స్థానం కల్పించింది కాంగ్రెస్ హైకమాండ్. అయితే ఈ ఎన్నికల కమిటీ స్థానం దక్కని నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ముఖ్యంగా పార్టీ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. ఉద్యమ సమయం నుంచి పార్టీలో ఉన్న తనకి ఏ కమిటీలోనూ స్థానం కల్పించలేదని.. తన పట్ల అధిష్టానం చిన్న చూపు చూస్తోందని పొన్నం ప్రభాకర్ అసహనంగా ఉన్నారు.

Also Read:కేర్ ఫుల్: పుట్టగొడుగులు తింటున్నారా..!

ఈ నేపథ్యంలో పొన్నం అనుచరులు గాంధీ భవన్ ముందు పెద్ద ఎత్తున ధర్నా కు దిగారు. అసలే అసహనంగా ఉన్న పొన్నం ఈ రెండు రోజుల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలవనున్నరట. తనను కమిటీలోకి ఎందుకు తీసుకోలేదో స్పష్టమైన కారణాలు తెలపాలని రేవంత్ రెడ్డిని పొన్నం డిమాండ్ చేసే అవకాశం ఉంది. అయినప్పటికీ పొన్నంకు స్థానం కల్పొంచకపోతే.. ఆయన తదుపరి ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఆయన పార్టీ వీడే అవకాశాలు ఉన్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Also Read:బ్రోకి నో కట్స్..అండ్ రన్ టైమ్ అదే!

- Advertisement -