సలార్ దరిదాపుల్లో లేని కల్కి..?

30
- Advertisement -

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రెబెల్ స్టార్ ప్రభాస్ మేనియా కొనసాగుతోంది. ప్రభాస్ నుంచి మూవీ కోసం దేశంలోని సినీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ లో అక్కడి అగ్రహీరోలకు సైతం షాక్ ఇచ్చేలా కలెక్షన్లు రాబడుతూ ఇండియన్ నెంబర్ ఒన్ హీరో స్థానానికి అతి చేరువలో ఉన్నాడు ప్రభాస్. ప్రస్తుతం ఆయన సలార్, ప్రాజెక్ట్ కే, మూవీస్ తో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాల నుంచి తాజాగా టీజర్స్ రిలీజ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. జులై 7 న మోస్ట్ అవైటెడ్ మూవీ ” సలార్ ” టీజర్ రిలీజ్ కాగా విడుదలైన 24 గంటల్లోనే 84 మిలియన్స్ వ్యూస్ సాధించి హిస్టరీ క్రియేట్ చేసింది. .

అంతే కాకుండా రెండు రోజుల్లోనే 100 మిలియన్స్ వ్యూస్ అందుకొని ఎవరికి సాధ్యం కానీ రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నాడు ప్రభాస్. అయితే ఆ తరువాత ప్రాజెక్ట్ కే మూవీకి సంబంధించి టైటిల్ రివిల్, గ్లిమ్స్ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించడంతో తన రికార్డ్ ను తానే బ్రేక్ చేసుకోవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. కానీ అలా జరగలేదు. ప్రాజెక్ట్ కే మూవీకి “కల్కి 2898 ఏ‌డి” అనే టైటిల్ రివిల్ చేస్తూ చిన్న గ్లిమ్స్ ను 22 అర్దరాత్రి లీలిజ్ చేసింది చిత్రా యూనిట్. అయితే ఎవరు ఊహించని విధంగా 24 గంటల్లో 5 మిలియన్స్ వ్యూస్ వద్ద మాత్రమే నిలిచి అందరిని షాక్ కు గురి చేసింది.

Also Read:బ్రోకి నో కట్స్..అండ్ రన్ టైమ్ అదే!

విజువల్స్ పరంగా కల్కి బాగానే ఉన్నప్పటికి వ్యూస్ మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. దీనికి కారణం ఆ మద్య గ్లిమ్స్ వీడియోను అమెరికాలో రిలీజ్ చేయడమే అని చెబుతున్నారు సినీ విశ్లేషకులు. దానికి తోడు కల్కి 2898 ఏ‌డి దర్శకుడు నాగ్ అశ్విన్ నార్త్ ఆడియన్స్ కు పెద్దగా తెలియక పోవడం కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. మొత్తానికి పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతున్న కల్కి 2898 ఏ‌డి మూవీ సలార్ మూవీ రికార్డుల దరిదాపుల్లో కూడా లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.

Also Read:BRO:థీమ్ ఆఫ్ బ్రో లిరికల్ వీడియో

- Advertisement -