ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో కాంగ్రెస్ కు ఊహించని షాక్ తగిలింది. కనీసం నాలుగు రాష్ట్రాల్లో గెలవాలని చూసిన హస్తం నేతలకు ఒక్క తెలంగాణ మినహా మిగిలిన మూడు రాష్ట్రాల్లో ఘోర పరాభవం ఎదురైంది. ముఖ్యంగా రాజస్తాన్, ఛత్తీస్ ఘడ్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి ఆ పార్టీ నేతలను తీవ్రంగా భాదిస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తరాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు ఈ స్థాయి ప్రతికూలత ఎందుకు ఎదురౌతోంది అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. కాగా నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమిపై ఆ పార్టీ నేతలు కూడా కొత్త చర్చలకు తావిస్తున్నాయి.
కాంగ్రెస్ ఓటమికి ఈవిఏం లే కారణం అని ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే దుమారం రేపుతున్న వేళ.. మద్య ప్రదేశ్ మాజీ సిఎం, కాంగ్రెస్ నేత కమల్ నాథ్ చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశం అవుతున్నాయి. తమ పార్టీకి చెందిన చాలమంది మాజీ ఎమ్మెల్యేలకు సొంతుళ్లలోనే కనీసం 50 ఓట్లు కూడా పడలేదని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్ పై ఈ స్థాయి వ్యతిరేకత ఉందా ? అనే ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు అధికారమిచ్చి తప్పు చేశారా ? అనే వాదనలు కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతున్నాయి. కాగా నార్త్ లో కాంగ్రెస్ పై ప్రజావ్యతిరేకతను గమనిస్తే అక్కడి ప్రజలు కాంగ్రెస్ ను బైకాట్ చేస్తున్నారా అనే సందేహాలు రాకమానవు. మరి ఉత్తరాదిన కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకతను స్వయంగా ఆ పార్టీనేతలే ఒప్పుకుంటున్న వేళ దక్షిణాదిన తొలిసారి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇక్కడ ఎలాంటి పాలన అందిస్తుందో చూడాలి.
Also Read:Revanth:రేవంత్ రెడ్డికి బిగ్ టాస్క్?