మోడీ రాక.. రాజకీయం కోసమేనా?

47
- Advertisement -

చాలా రోజుల తరువాత నేడు ప్రధాని మోడీ తెలంగాణకు వచ్చారు. వరంగల్ కు సంబంధించి కాజీపేట రైల్వే మాన్యుఫార్చరింగ్ యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన అలాగే మంచిర్యాల వరంగల్ విభాగంలో హైవే రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ రెండు ప్రాజెక్ట్ లకు సంబంధించి నిర్మాణ వ్యయం రూ. 6,100 కోట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంచితే అనంతరం హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్ లో నిర్వహించిన సభలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. చాలా రోజుల తరువాత రాష్ట్రనికి వచ్చిన మోడీ.. తెలంగాణకు కేంద్రం ఏం చేసిందో.. ఏం చేయాల్సి ఉందో చెప్పకుండా కే‌సి‌ఆర్ సర్కార్ పై విమర్శలు చేయడమే పని గా పెట్టుకున్నారు.

కేంద్ర సహకారం లేకుండానే అన్నీ రంగాల్లో దూసుకుపోతున్న తెలంగాణలో అభివృద్ది శూన్యం అని చెప్పడంలోనే ప్రధాని వైఖరి ఏంటో స్పష్టంగా అర్థమౌతోంది. తన ప్రసంగం మొదటి నుంచి పూర్తి చేసే వరకు కేవలం కే‌సి‌ఆర్ పై బురద చల్లే కార్యక్రమమే పెట్టుకున్నారు తప్ప, బయ్యారం స్టీల్ ప్లాంట్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వ విధ్యాలయం వంటి వాటిపై ఎలాంటి స్పస్తమైన ప్రకటన ఇవ్వలేదు ప్రధాని మోడీ. దీంతో మోడీ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ నెంబర్ ఒన్ అంటూ అవార్డులు ఇచ్చిన వారే ఇప్పుడు తెలంగాణకు వచ్చి కే‌సి‌ఆర్ పాలనను తిడుతున్నారని, తెలంగాణ పథకాలను కేంద్రం కాపీ కొడుతోందని మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. జాతీయంగా కిసాన్ ఏజండాతో ముందుకు సాగుతున్న కే‌సి‌ఆర్ ను చూస్తే మోడీకి భయం వేస్తోందని, అందుకే సి‌ఎం కే‌సి‌ఆర్ ను తిట్టదమే పనిగా పెట్టుకున్నారని మంత్రి హరీష్ రావు చెప్పుకొచ్చారు. అటు ప్రజలు కూడా ఇది రాజకీయ సభనా లేక ప్రభుత్వ సభనా మోడీజి అంటూ ప్రశ్నిస్తున్నారు.

Also Read:Harish:అభివృద్ధిని చూసి ఓర్వలేకే విమర్శలు

- Advertisement -