KTR:పకోడిలు వేయడం ఉద్యోగాలా..?

56
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్రమోడీపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు మంత్రి కేటీఆర్. వరంగల్ సభలో తెలంగాణలో ఉద్యోగాలపై మోడీ ప్రస్తావించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్.ఉద్యోగం అడిగితే పకోడీలు వేసుకోవాలని మోడీ అన్నారని, ఇప్పుడు వరంగల్ వచ్చి యువత, ఉద్యోగాల గురించి ఆయన మాట్లాడటం వింతగా ఉందని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వంలో 16 లక్షల ఖాళీలు భర్తీచేయలేదని…తెలంగాణకు వచ్చి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని చెప్పారు. తాము 2 లక్షలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని కేటీఆర్ అన్నారు. సర్కారు పంపిన బిల్లులను ఆమోదించకుండా యూనివర్సిటీ ఖాళీల భర్తీని గవర్నర్ తమిళిసై అడ్డుకున్నారన్నారు.

Also Read:Harish:అభివృద్ధిని చూసి ఓర్వలేకే విమర్శలు

మోదీ తన తొమ్మిదేళ్ల పాలనలో దేశ యువత కోసం చేసిన ఏం చేశారని, కనీసం ఒక్క మంచి పనైనా చేసి, దాని గురించి వివరించి చెబితే బాగుండేదని కేటీఆర్ అన్నారు. భారత చరిత్రలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం మోదీ పాలనలో పెరిగిందని చెప్పారు. 15,000 మంది స్థానికులకు ఉద్యోగాలిచ్చే బయ్యారం ఫ్యాక్టరీ గురించి కూడా మోదీ ఏమీ మాట్లాడలేదని చెప్పారు. నల్ల చట్టాలతో మోదీ 700 మంది రైతులను పొట్టనబెట్టుకున్నారని, ఇప్పుడు వరంగల్ వచ్చి వ్యవసాయం గురించి మాట్లాడడం ఏంటని నిలదీశారు.

Also Read:పవన్ ఫ్యాన్స్ గెట్ రెడీ

- Advertisement -