వచ్చే ఆగష్టు 15..మోడీ మాజీ ప్రధాని అవుతారా?

34
- Advertisement -

కేంద్రంలో ఓ ప్రస్తుతం బీజేపీ సర్కార్ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు సార్లు అధికారం చేపట్టిన కాషాయ పార్టీ వచ్చే ఎన్నికల్లో కూడా అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతోంది. 2014 మరియు 2019 ఎన్నికల్లో మోడీ మేనియానే నమ్ముకున్న బీజేపీ.. ఈసారి కూడా మోడీ మంత్రంతోనే అధికారం పై కన్నెసింది. అయితే ఈసారి మోడీ అధికారంలోకి రావడం అంతా తేలికైన విషయం కాదు. గడిచిన ఈ నాలుగేళ్లలో మోడీ పాలనపై సానుకూలతతో పాటు వ్యతిరేకత కూడా వ్యక్తమౌతువస్తోంది. మోడీ నియంత పాలన, మితిమీరిన అధికార దాహం, ఆయా రాష్ట్రాలలో ప్రభుత్వాలను కూల్చడం, ప్రతిపక్ష నేతలపై కక్ష పూరితంగా వ్యవహరించడం, నిత్యవసర ధరల పెంపు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు మోడీ విధానాలను వేలెత్తి చూపేలా చేస్తున్నాయి. .

మరోవైపు మోడీ సర్కార్ ను ఎలాగైనా గద్దె దించాలనే లక్ష్యంతో విపక్షాలన్ని ఏకతాటిపైకి వచ్చి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. ఇలా అన్నీ వైపులా మోడీకి ప్రతికూలతే ఎదురవుతోంది. అయినప్పటికి వచ్చే ఎన్నికల్లో విజయం మాదే అని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ గాంభీర్యం అంతా పై పైనే అని బీజేపీ నేతల్లో కూడా ఈ సారి గెలుపుపై సందేహంగానే ఉన్నారనే టాక్ నడుస్తోంది. ముఖ్యంగా ఈ మద్య మణిపూర్ వ్యవహారం బీజేపీని గట్టిగా దెబ్బ తీస్తోంది. ఇక్కడి జరుగుతున్నా అల్లర్లు బీజేపీపై వ్యతిరేకత పెరిగేలా చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో నేడు ఆగష్టు 15 కావడంతో ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసిన తరువాత ప్రధాని మోడీ పలు ఆసక్తికర విషయాలు ప్రస్తావించారు. ఈ పదేళ్ళలో దేశం ఎంతో పురోగతి సాధించిందని , ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయని వ్యాఖ్యానించారు మోడీ. ఇక మణిపూర్ అల్లర్లపై కూడా స్పందించారయన. మణిపూర్ లో తీవ్ర కల్లోలిత పరిస్థితులు నెలకొన్నాయని ఈ నేపథ్యంలో దేశమంతా మణిపూర్ ప్రజలకు అండగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇక వచ్చే ఎన్నికల్లో గెలిచి ఆగష్టు 15 న మళ్ళీ ప్రధాని గా జాతీయ జెండా ఎగురవేస్తానని చెప్పుకొచ్చారు. మరి ప్రస్తుతం మోడీ సర్కార్ పై వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో వచ్చే ఆగష్టు 15 నాటికి ప్రధానిగానే వస్తారా ? లేదా మాజీ ప్రధానిగా మారతారా ? అనేది చూడాలి.

Also Read:బి‌ఆర్‌ఎస్‌లో మరో పార్టీ విలీనం!

- Advertisement -