ఓహో.. మోడీ ప్లాన్ ఆదేనా?

39
- Advertisement -

మోడీ సర్కార్ కు ఎన్నికలు దగ్గర పడితే తప్పా అభివృద్ది గుర్తుకు రానట్లే ఉంది. ఇన్నాళ్ళు ఏంపట్టనట్టుగా వ్యవహరించి ఇప్పుడు హడావిడిగా ప్రాజెక్ట్ ల ప్రారంభోత్సవలకు శంకుస్థాపనలు చేస్తున్నారు. అది కూడా ఎన్నికలు ఉన్న రాష్ట్రాలలోనే.. ఈ ఏడాది చివర్లో జార్ఖండ్, మద్య ప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్తాన్, తెలంగాణ వంటి రాష్ట్రాలల్లో ఎన్నికలు జరగనున్నాయి. జార్ఖండ్ లో సంగతి అటుంచితే ప్రస్తుతం మద్యప్రదేశ్ లో బిజెపి అధికారంలో ఉంది..

ఇక తెలంగాణ, రాజస్తాన్, ఛత్తీస్ ఘడ్ వంటి రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో లేదు. దీంతో ఈ మూడు రాష్ట్రాలలో పట్టు కోసం మోడీ మాస్టర్ ప్లానే వేసినట్లు తెలుస్తోంది. ఈ మూడు రాష్ట్రాలలో పలు ప్రాజెక్ట్ ల నిర్మాణం చేపట్టి అక్కడి ప్రజలను ఆకర్షించాలని చూస్తున్నారు. నిన్న ఛత్తీస్ ఘడ్ లో పర్యటించిన ప్రధాని అక్కడ రూ. 7,600 కోట్ల విలువైన పలు ప్రాజెక్ట్ లకు శంకుస్థాపన చేశారు. ఇక నేడు తెలంగాణకు వచ్చిన మోడీ ఇక్కడ రూ.6,100 కోట్ల విలువ గల కాజీపేట రైల్వే మాన్యుఫార్చరింగ్ యూనిట్, మంచిర్యాల వరంగల్ హైవే రోడ్డు నిర్మాణం శంకుస్థాపన వంటి కార్యక్రమాలు చేపట్టారు.

Also Read:మోడీ రాక.. రాజకీయం కోసమేనా?

ఇక ఈ రోజే రాజస్తాన్ లో కూడా పర్యటించనున్న మోడీ అక్కడ కూడా పలు ప్రాజెక్ట్ ల ప్రారంభోత్సవాలు, శంకు స్థాపనలు చేయనున్నారు. ఇలా ఎప్పుడు లేని విధంగా బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలపై మోడీ సర్కార్ దృష్టి సారించడం వెనుక.. ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసమే అనేది స్పష్టంగా అర్థమౌతోంది. అయితే ఇన్నాళ్లు ఈ రాష్ట్రాలపై కన్నెత్తి కూడా చూడని మోడీ సర్కార్ ఇప్పుడు హడావిడిగా పలు ప్రాజెక్ట్ లు చేపట్టినంత మాత్రనా ప్రజల దృష్టి బీజేపీ పై పడుతుందనుకోవడం హాస్యాస్పదమే. మొత్తానికి ప్రస్తుతం మోడీ పర్యటనలు ఎన్నికల పట్టుకోసమే అనేది స్పష్టంగా అర్థమౌతోంది.

- Advertisement -