మణిపూర్ సి‌ఎం రాజీనామా?

45
- Advertisement -

ఈ మద్య మణిపూర్ చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలు అన్నీ ఇన్ని కావు. నిత్యం కుల వివాదాలతో ఆ రాష్ట్రం అట్టుదికిపోతుంది. తరచూ ఏదో ఒక చోట ఆ రాష్ట్రంలో సంచలన ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇటీవల ఇటీవల ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి నగ్నంగా రోడ్డుపై ఊరేగించిన ఘటన దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలనం అయిందో అందరికీ తెలిసిందే. ఆ ఘటనతో ఆ రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వంపై దేశ ప్రజలు తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు..

అసలు మణిపూర్ లో ఈ స్థాయి వివాదాలు చెలరేగుతుంటే మోడి సర్కార్ ఎందుకు మౌనం వహిస్తోందని ఇతర రాజకీయ నాయకులతో పాటు సామాన్యులు కూడా ఘాటుగా విమర్శిస్తున్నారు. మేకిన్ ఇండియా వంటి అభివృద్ది అవసరం లేదని.. ముందు దేశంలో కులమతాల మద్య వివాదాలను రూపు మాపండి అంటూ ఆర్తిస్తున్నారు. ఇదిలా ఉంచితే రాష్ట్రంలో ఈ స్థాయి అల్లర్లు జరుగుతున్నా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలాంటి చర్చలు తీసుకోకపోవడంపై చాలానే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సి‌ఎం బీరెన్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడని జాతీయ మీడియాల్లోనూ, సోషల్ మీడియాలోనూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Also Read:కేంద్రాన్ని తూర్పారబట్టిన సుప్రీం..

దాంతో వైరల్ అవుతున్న వార్తలపై బీరెన్ సింగ్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. తాను రాజీనామా చేయలేదని. ఒకవేళ రాజీనామా చేయాల్సి వస్తే పార్టీ పెద్దల నిర్ణయం మేరకు తాను సిద్దమని చెప్పుకొచ్చారు. కాగా బీరెన్ సింగ్ పై ఎలాంటి చర్యలు తీసుకోకపోతే అది పార్టీ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని బీజేపీ పెద్దలు కూడా భావిస్తున్నారట. ఒకవేళ బీరెన్ సింగ్ ను సి‌ఎం పదవి నుంచి తప్పిస్తే.. అల్లర్ల విషయంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యమే అని అందుకే సి‌ఎం పదవి నుంచి బీరెన్ సింగ్ ను తప్పించారని విపక్షాలు విమర్శించే అవకాశం ఉంది. మరి బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Also Read:ఏమిటో.. ?ఈ దైవాంశ సంభూతుడు!

- Advertisement -