అయితే జుమ్లా…లేకపోతే హమ్లా

172
ktr
- Advertisement -

బీజేపీ నేతల మాటలు అయితే జుమ్లా మాటలు…లేకపోతే హమ్లా అన్నారు మంత్రి కేటీఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనవర్సిటీ లో మీడియా అకాడమీ ఆఫ్ తెలగాణ స్టేట్ నేషనల్ సెమినార్ జరిగింది. మీడియా ఇన్ తెలంగాణ పాస్ట్, ప్రెసెంట్ ఫ్యూచర్ అంశం పై రెండు రోజుల జాతీయ సెమినార్ జరిగింది.

ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్…జో బైడన్ హెలికాప్టర్ క్యాబిన్ ఇక్కడ తయారుఅవుతుంది,ఐటీ లో మంచి కంపెనీలు హైద్రాబాద్ లో ఉన్నాయి..ఇది వార్త కదా…మన విషయం మనం చెప్పుకుంటే తప్పేంటి అన్నారు. మేము తప్పు చేస్తే చీల్చి చెండాడన్నారు. ఎప్పుడు ఐటీ,ed దాడుల వార్తలేనా ప్రశ్నించారు.

మంచి చేసినప్పుడు ఎందుకు చూపించడం లేదన్నారు. అనితర సాధ్యమైన ఇంజనీరింగ్ ఫీట్ చేస్తే ఎందుకు చూపించడం లేదన్నారు. మిషన్ భగీరథ వల్ల చెరువు కట్టలు తెగడం లేదు…ఇది వార్త కాదు…కానీ కట్ట తెగిటే వార్త అన్నారు. పాల,చేపల ఉత్పత్తి లో ముందు లో ఉన్నాం..ఇవన్నీ వార్తలు కావా? అని ప్రశ్నించారు. అన్ని రంగాల్లో ఉన్న పాజిటివ్ వార్తలు ను ఎందుకు చూపించారన్నారు.

ఏ వార్తలు సెంటర్ పయింట్ అవ్వాలో అవి ఉండవ్…దేశ ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నం అవుతున్న, ద్రవ్యోల్బనం పడిపోతున్న,నిరుద్యోగం పెరుగుతున్న వార్తలు రావు…ఏం తినాలి,ఏం వేసుకోవాలి అనేవి వార్తలు అన్నారు. జర్నలిస్టులను అనడం తన ఉద్దేశం కాదని కొంతమంది వల్ల అలా అనాల్సివస్తుందన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -