సోరియాసిస్ వల్ల గుండెకు ప్రమాదమా?

21
- Advertisement -

సోరియాసిస్ అనేది ఒక ధీర్ఘకాలిక చర్మవ్యాధి. ఈ వ్యాధి సోకిన వారిలో చర్మం పొలుసులుగా మారడం, ఎర్రటి మచ్చలు, దురద వంటి లక్షణాలు కనిపిస్తాయి. సోరియాసిస్ కు సంబంధించిన మచ్చలు శరీరంలో ఏ భాగంలోనైనా కనిపిస్తూ ఉంటాయి. చేతులు, మోకాళ్ళు, ,మోచేతులు, కాళ్ళు, వీపు, తలపై, తొడల భాగంలోనూ ఇలా చాలా చోట్ల సోరియాసిస్ లక్షణాలు కనిపిస్తాయి. ఇంకా చర్మం పగలడం, పుండ్లుగా మారడం, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు కూడా సోరియాసిస్ వచ్చిన వారిలో కనిపిస్తాయి. అయితే ఈ వ్యాధి రావడానికి చాలానే కారణాలు ఉన్నాయి కొందరిలో రఒగనిరోధక శక్తి తక్కువైతే కూడా ఈ వ్యాధి సంక్రమించే అవకాశం ఉంది.

Also Read:పిక్ టాక్ : అందాలతో అదరగొట్టింది

మరికొందరికి జన్యుపరమైన లోపాల కారణం కూడా కావొచ్చు. అయితే ఈ సోరియాసిస్ ఉన్నవారిలో గుండె సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు పరిశోదకులు చెబుతున్నారు. సోరియాసిస్ ఉన్నవారిలో గుండె స్పందనలో మార్పులు సంభవించడం, కరొనరీ మైక్రోవస్కులర్ డిస్పంక్షన్ లక్షణాలు కనిపించడం జరుగుతోందట. మైక్రో వస్కులర్ డిస్పంక్షన్ అంటే గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్త నాళాలల్లో వచ్చే ఒకరకమైన గుండె సంబంధిత వ్యాధి. ఇది సోరియాసిస్ వచ్చిన వారిలో ఎక్కువగా కనిపిస్తున్నట్లు పరిశోదనలు చెబుతున్నాయి. కాబట్టి సోరియాసిస్ సంక్రమిస్తే గుండె సంబంధిత పరీక్షలను కూడా చేయించుకోవడం మంచిదట. ఇక సోరియాసిస్ ను నివారించడంలో వ్యక్తిగత పరిశుభ్రత చాలా అవసరం అలాగే విటమిన్ డి ఎక్కువగా ఉండే పదార్థాలను తినాలి. ఇంకా ధూమపానం మద్య పానం వంటివి సోరియాసిస్ ను పెంచే అవకాశం ఉంది కాబట్టి వాటికి మానుకోవడం మంచిది, ముఖ్యంగా సోరియాసిస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవడం ఉత్తమం.

Also Read:TTD:ఆక‌ట్టుకున్న ధార్మిక‌, సంగీత కార్య‌క్ర‌మాలు

- Advertisement -