సీడబ్ల్యూసీలో లెక్క తేలుతుందా?

35
- Advertisement -

తెలంగాణపై కాంగ్రెస్ గట్టిగా దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో విజయంపై గురి పెట్టి రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. అయితే పార్టీ నేతల్లో కనిపిస్తున్న జోష్ ప్రజల్లో మాత్రం ప పార్టీపై కనిపించడం లేదు. దాంతో ప్రజలను ఆకర్చించేందుకు రకరకాల స్టంట్స్ చేస్తున్నారు హస్తం నేతలు. జాతీయ నేతలు తరచూ తెలంగాణలో పర్యటించడం, వారంలో కనీసం రెండు లేదా మూడు సార్లు సమావేశాలు నిర్వహించడం వంటివి చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు హస్తం నేతలు. అయితే కాంగ్రెస్ ఎందుకింత హైరానా చేస్తోదంటే ఆ పార్టీలోని డొల్లతనాన్ని కప్పిబుచ్చుకునేందుకే అనేది కొందరు రాజకీయ వాదులు చెబుతున్నా మాట..

ఎన్నికలు దగ్గర పడడంతో సీట్ల పంపకాల విషయంలో తీవ్రంగా అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయి. సీటు ఆశిస్తున్నది ఒకరైతే కేటాయిస్తున్నది మరొకరికాని ఆ పార్టీలోని చాలమంది నేతలు నిప్పులు చెరుగుతున్నారు. అయితే ఇంకా అభ్యర్హుల జాబితా ప్రకటించకపోయినప్పటికి ఆల్రెడీ సీట్ల కేటాయింపు జరిగిందనే వాదన కూడా నడుస్తోంది. అయితే పాలేరు, కొత్తగూడెం, అస్నాబాద్.. అలాగే నల్గొండ లోని మరో ఐదు నియోజిక వర్గాలు ఇలా చాలా చోట్ల ఆ పార్టీని వర్గ పేరు వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో సీట్ల కేటాయింపు జరపడం పార్టీ స్క్రినింగ్ కమిటీకి తీవ్ర తలనొప్పిగా మారింది.

ఇక పోతే నేటి నుంచి హైదరబాద్ లో సీడబ్ల్యూసి సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ జాతీయ నేతలంతా హైదరబాద్ లో వాలిపోయారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశంలో సీట్ల కేటాయింపు. ఎన్నికల స్ట్రాటజీ, వంటి వాటిపై తుది నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందట. ఇక ఆ తరువాత నిర్వహించే బహిరంగ సభలో తొలి జాబితా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని టాక్. అలాగే సోనియా గాంధీ సమక్షంలో మేనిఫెస్టో కూడా ప్రకటించే ఛాన్స్ ఉందట. మరి ఈ సీడబ్యూసి సమావేశాల్లో హస్తం పార్టీ ఇంకెలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.

Also Read:ఫీల్ గుడ్ ఫిల్మ్.. ‘ప్రేమ విమానం’

- Advertisement -